జైలర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టోటల్ టార్గెట్ ఎంతంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా ఎలాంటి సినిమా చేసిన కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద నష్టాలను అయితే ఎదుర్కొంటున్నాడు.
By: Tupaki Desk | 7 Aug 2023 2:07 PM GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా ఎలాంటి సినిమా చేసిన కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద నష్టాలను అయితే ఎదుర్కొంటున్నాడు. ఇక ఈసారి ఎలాగైనా నిర్మతలకు భారీ స్థాయిలో ప్రాఫిట్ అందించాలి అని జైలర్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాకు గత కొన్ని వారాల ముందు వరకు కూడా పెద్దగా పాజిటివ్ బజ్ అయితే లేదు.
కానీ మెల్లమెల్లగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తమన్నా స్పెషల్ సాంగ్ భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. దానికి తోడు ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. ఇక మొత్తానికి సినిమా బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్లుగా తెలుస్తోంది. జైలర్ సినిమా విడుదలకు ముందు థియేట్రికల్ గా ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..
ఏరియాలో వారిగా చూసుకుంటే ముందుగా తమిళనాడులోని ఈ సినిమాకు దాదాపు 60 కోట్ల రేంజ్ లోనే ధర పలికినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక మొత్తంలో చూసుకుంటే 10 కోట్ల వరకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే 12 కోట్లకు డీల్ క్లోజ్ అయింది. ఇక కేరళలో 5.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా మిగతా రెస్టాఫ్ ఇండియా పరంగా చూసుకుంటే 3 నుంచి 4 కోట్ల మధ్యలోనే ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఇక ఇండియా మొత్తంలో కూడా జైలర్ సినిమా దాదాపు 91 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో చూసుకుంటే 32 కోట్లు ధర పలికినట్లుగా తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా జైలర్ సినిమా థియేట్రికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 123 కోట్లకు సెట్ అయ్యింది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం 124 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాలి.
అంటే దాదాపు 250 కోట్ల రేంజ్ లో అయితే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది. కానీ గత కొంతకాలంగా రజినీకాంత్ మార్కెట్ రేషియో చూసుకుంటే మాత్రం ఏ సినిమా కూడా పెట్టిన పెట్టుబడికి అనుకున్నంత స్థాయిలో ప్రాఫిట్స్ అందించలేదు. 2011 తరువాత ఆయన ప్రతి సినిమా కూడా ఎంతో కొంత నష్టాలను కలుగజేస్తూనే ఉంది. మరి ఈసారి జైలర్ ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.