Begin typing your search above and press return to search.

జవాన్ కలెక్షన్స్ సునామీ.. తెలుగులో ఎంతంటే

షారుఖ్ ఖాన్ హీరోగా అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 10:05 AM GMT
జవాన్ కలెక్షన్స్ సునామీ.. తెలుగులో ఎంతంటే
X

షారుఖ్ ఖాన్ హీరోగా అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పఠాన్ కంటే మించిపోయే విధంగా జవాన్ కి జన ప్రభంజనం కనిపిస్తోంది. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో బాలీవుడ్ లో మొదటిసారి జవాన్ లాంటి మూవీ చూస్తున్నారు. ఈ కారణంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి విపరీతంగా మూవీ నచ్చేస్తోంది.

చెప్పుకోదగ్గ గొప్ప కథ కాకపోయిన టేకింగ్, ఎలివేషన్స్ పరంగా అత్లీ తన మార్క్ చూపించారు. దీంతో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సినిమా సూపర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే సినిమా 374 కోట్లకి క్రాస్ చేసింది. మొదటి రోజు 125.05 కోట్ల గ్రాస్ వస్తే మూడో రోజైన శనివారం ఏకంగా 140.17 కోట్ల గ్రాస్ ని సాధించింది. బాలీవుడ్ లో హైయెస్ట్ వన్ డే కలెక్షన్స్ రికార్డుని శనివారం జవాన్ అందుకుంది.

ఆదివారం 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కెరియర్ లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న మూవీ జవాన్ కావడం విశేషం. కచ్చితంగా బాద్ షా ఖాతాలో మరో వెయ్యి కోట్లు పక్కా అని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా జవాన్ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 17.50 కోట్ల బిజినెస్ జరిగింది. 18.50 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన జవాన్ మూవీ మూడు రోజుల్లో ఏకంగా 12.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 24.65 కోట్ల వరకు ఉంది. దీనిలో నైజాం ఏరియాలో 9.40 కోట్ల గ్రాస్ అందుకుంది. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకో 6.15 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. రెండు రోజుల్లో ఈ షేర్ వచ్చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

పఠాన్ సినిమా కూడా తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ గొల్లగొట్టింది. ఇప్పుడు జవాన్ మూవీ అయితే పఠాన్ కలెక్షన్స్ కి బ్రేక్ చేసే దిశగా వెళ్తోంది. 30 నుంచి 40 కోట్ల షేర్ ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.