Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: అక్కడ నెంబర్ వన్ లోనే కల్కి

ఈ సినిమా శనివారం నాటికి నార్త్ అమెరికా లో 15 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   7 July 2024 4:42 AM GMT
బాక్సాఫీస్: అక్కడ నెంబర్ వన్ లోనే కల్కి
X

కల్కి 2898ఏడీ మూవీ నార్త్ అమెరికాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. అక్కడ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన జెట్ స్పీడ్ తో థియేటర్స్ లో పరుగులు పెడుతోంది. కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రవాసులు కూడా కల్కి 2898ఏడీ చిత్రాన్ని యూఎస్ లో విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే కలెక్షన్స్ ఎక్కడ డ్రాప్ కనిపించడం లేదు. ఈ సినిమా శనివారం నాటికి నార్త్ అమెరికా లో 15 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది.

తద్వారా అత్యంత వేగంగా 15 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్న ఇండియన్ మూవీగా కల్కి అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూసుకున్న కల్కి కంటే ముందు బాహుబలి 2, పఠాన్, ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాలు ఉన్నాయి. రికార్డులలో టాప్ 2 తప్ప మిగిలిన రెండు ఆదివారం కలెక్షన్స్ తో కల్కి మూవీ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

బాహుబలి 2 మూవీ లాంగ్ రన్ లో 20.7 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో అందుకుంది. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ పఠాన్ పేరు మీద ఉన్నాయి. ఈ చిత్రం 17.4 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది. తరువాత ఆర్ఆర్ఆర్ మూవీ 15.3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది. షారుఖ్ జవాన్ మూవీ 15.2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

జవాన్, ఆర్ఆర్ఆర్ సినిమాల కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ ఆదివారం బ్రేక్ చేయబోతోందని కచ్చితంగా చెప్పొచ్చు. పబ్లిక్ హాలిడే కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారు. లాంగ్ రన్ లో బాహుబలి2 కలెక్షన్స్ రికార్డ్ ని కూడా కల్కి బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్స్డ్ లో కథని చెప్పడం, ఇండియన్ మైథాలజీని ప్రెజెంట్ ట్రెండ్ కి అర్ధమయ్యేలా తెలియజేయడంతోనే కల్కి సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభిస్తోంది.

ఇక వరల్డ్ వైడ్ గా 800+ కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసిన మూవీ శనివారం, ఆదివారాలు వచ్చే వసూళ్లతో 900+ కోట్లు అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ ఇమేజ్, అమితాబ్ బచ్చన్ క్రేజ్, దీపికా పదుకునే పెర్ఫార్మెన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లాయి. వీరిని అద్భుతంగా తెరపై రిప్రజెంట్ చేసిన నాగ్ అశ్విన్ కి మూవీ సక్సెస్ క్రెడిట్ మొత్తం లభిస్తుందని చెప్పొచ్చు.