కరణ్ జోహార్ విరోధి ఔట్ సైడర్ ఎందులోను తగ్గేదేలే..!
బాలీవుడ్ లో ఔట్ సైడర్ గా ప్రవేశించి క్రేజీ హీరోగా ఎదిగాడు కార్తీక్ ఆర్యన్. తనదైన ప్రతిభ ఎంపికలతో విలక్షణ నటుడిగా యూత్ హార్ట్ త్రోబ్ గా అతడు అలరిస్తున్నాడు.
By: Tupaki Desk | 6 Aug 2023 5:19 AM GMTబాలీవుడ్ లో ఔట్ సైడర్ గా ప్రవేశించి క్రేజీ హీరోగా ఎదిగాడు కార్తీక్ ఆర్యన్. తనదైన ప్రతిభ ఎంపికలతో విలక్షణ నటుడిగా యూత్ హార్ట్ త్రోబ్ గా అతడు అలరిస్తున్నాడు. ఇంతకుముందే 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి నెక్ట్స్ లెవల్ గేమ్ వైపు దూసుకుపోతున్నాడు. 40 కోట్ల క్లబ్ నుంచి అమాంతం 100కోట్ల క్లబ్ లోకి రావడంతో అతడు తన పరిధిని విస్తరించుకునే పనిలో ఉన్నాడు. హారర్ మూవీ భూల్ భులయా 2తో వంద కోట్ల క్లబ్ లో ప్రవేశించడమే గాక.. 250 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. నేటితరంలో ప్రామిస్సింగ్ కమర్షియల్ హీరోగా అతడు తనకంటూ మార్కెట్ ని దక్కించుకున్నాడు. ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న క్రేజీ ఫ్రాంఛైజీ భూల్ భులయాని తన ఖాతాలో వేసుకున్న కార్తీక్ మునుముందు బిగ్ రేంజ్ హీరోగా సత్తా చాటనున్నాడు.
తాజా సమాచారం మేరకు.. ఇప్పుడు అతడి నాన్ థియేట్రికల్ రేంజ్ 140కోట్లు.. థియేట్రికల్ బిజినెస్ మరో 100కోట్లకు తగ్గడం లేదని ట్రేడ్ చెబుతోంది. తాజాగా కార్తీక్ నటించిన `చందు చాంపియన్` బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. స్పోర్ట్స్ డ్రామాతో అతడు తన స్థాయిని పెంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
అతడు ఇన్ సైడర్ కాదు.. ఔట్ సైడర్.. అయినా బాలీవుడ్ లో ఎదురే లేదని నిరూపణ అవుతోంది. నిజానికి దోస్తానా 2 నుంచి కార్తీక్ ఆర్యన్ ని తొలగిస్తున్నానని కరణ్ జోహార్ ప్రకటించగానే ఇక అతడు కోలుకోవడం కష్టమేనని అంతా భావించారు. కానీ తనకు పరాభవం ఎదురైన కొద్దిరోజుల్లోనే కార్తీక్ భూల్ భులయా 2 రూపంలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. పరిశ్రమ కేవలం ఇన్ సైడర్స్ కి మాత్రమే కాదు.. మాఫియా కనుసన్నల్లో మెలిగే వారికి మాత్రమే కాదని నిరూపించాడు. క్వీన్ కంగన సైతం కార్తీక్ కి మద్ధతుగా నిలిచింది.
కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చందు ఛాంపియన్ కి కబీర్ ఖాన్ దర్శకుడు. సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ సహా ప్రచారమెటీరియల్ అభిమానులను ఆకట్టుకుంది. లండన్ సహా పలు దేశాల్లో చందు ఛాంపియన్ షూటింగ్ సాగింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.