ఖుషి డే-2 బాక్సాఫీస్.. ఇలా తగ్గితే ఏం లాభం!
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు అంచనాలకు తగ్గట్టుగానే మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 3 Sep 2023 7:56 AM GMTవిజయ్ దేవరకొండ ఖుషి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు అంచనాలకు తగ్గట్టుగానే మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. విజయ్ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టినప్పటికీ కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం ఏమీ కనిపించలేదు అని చెప్పవచ్చు. విడుదలకు ముందే సినిమా సాంగ్స్ బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించింది.
ఇక ఆ ప్రభావంతో మొదటి రోజే ఖుషి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 9 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. అయితే రెండవ రోజు మాత్రమే సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఒక విధంగా టార్గెట్ ను రీచ్ కావాలి అంటే ఈ తరహా స్పీడ్ అయితే అసలు సరిపోదు. ఈ వీకెండ్ వీలైనంత త్వరగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకుంటే ఆ తర్వాత మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ ఈ వరమే టార్గెట్ కు దరిదాపుల్లో కూడా లేకపోతే ఆ తర్వాత టార్గెట్ ను చేరుకున్న కూడా ప్రాఫిట్స్ పెద్దగా వచ్చే అవకాశం ఉండదు. ఇక సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 5 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రోజుల్లో కలుపుకొని 15.23 కోట్లు షేర్, 24.90 కోట్ల గ్రాస్ వచ్చింది.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60 కోట్లు మిగతా భాషల్లో మొత్తంగా 1.05 కోట్లు, ఓవర్సీస్ లో 5.95 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా ఖుషి సినిమా థియేట్రికల్ మార్కెట్లో 52 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 53 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంటే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక ఈ సినిమా మొత్తం గా రెండు రోజుల్లో కేవలం 23.83 కోట్లు షేర్ కలెక్షన్స్ 43.30 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
అంటే ఇంకా సక్సెస్ కావాలి అంటే దాదాపు 30 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ వెనక్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారం ఖుషి సినిమా వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవాలి. మళ్లీ సోమవారం రోజు నుంచి వర్కింగ్ డేస్ కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి ఖుషి సినిమా మూడో రోజు ఎలాంటి వసూళ్ళను అందుకుంటుందో చూడాలి.