లియోపై సితార హై రిస్క్.. మాస్టర్, బీస్ట్ కంటే ఎక్కువే..
కానీ ఆ సినిమా దారుణంగా నష్టాలు కలుగజేసింది
By: Tupaki Desk | 20 July 2023 5:02 AM GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు కేవలం ప్రొడక్షన్ వైపే కాకుండా డిస్ట్రిబ్యూషన్స్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అయితే రెండు పడవల మీద ప్రయాణం సక్సెస్ అనేది చాలా కష్టమైన పని. డిస్ట్రిబ్యూషన్స్ లో ఎంతో కాలం ఉన్న వారే సరిగ్గా సక్సెస్ అందుకోవటం లేదు. ఈ ప్రయాణాలలో కేవలం ఏషియన్ సినిమాస్, దిల్ రాజు, గీత ఆర్ట్స్ లాంటివాళ్ళు మాత్రమే బలంగా నిలదొక్కుకుంటున్నారు.
అయితే ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ కూడా డిస్ట్రిబ్యూషన్స్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కానీ వాళ్ళు ఇంకా ఆ రూట్లో అయితే బలంగా నిలబడలేదు. ఇక ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్స్ లో అడుగు పెట్టింది. లియో సినిమా హక్కులను ఈ సంస్థ కాస్త ఎక్కువ రేట్ కి సొంతం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది.
ఇప్పటివరకు విజయ్ సినిమాలకు తెలుగులో ఎవరు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదు. మాస్టర్ సినిమా దాదాపు 10 కోట్లకు దిల్ రాజు తెలుగులో సొంతం చేసుకుని మంచి లాభాలను అయితే అందుకున్నారు.
ఇక తర్వాత వచ్చిన బీస్ట్ మాత్రం 11 కోట్లకు ముగ్గురు నిర్మాతలు కలిసి సొంతం చేసుకున్నారు. ఏషియన్ సినిమాస్ దిల్ రాజు సురేష్ ప్రొడక్షన్స్ ముగ్గురు కలిసి బీస్ట్ సినిమాలు తెలుగులో విడుదల చేశారు.
కానీ ఆ సినిమా దారుణంగా నష్టాలు కలుగజేసింది. ఇక ఈసారి ఆ ముగ్గురు కూడా విజయ్ లియో సినిమాపై పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ ఛాన్స్ తీసుకుని దాదాపు 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక విధంగా ఈ స్థాయిలో రేటు పెట్టడానికి కారణం లోకేష్ కనగరాజ్ రాజా అని చెప్పాలి.
ఎందుకంటే అతను చివరి సినిమా విక్రమ్ తెలుగులో భారీ స్థాయిలో లాభాలను అందించింది. విక్రమ్ ను నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ మూవీస్ తెలుగులో డిస్ట్రిబ్యూషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈసారి మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలోనే విజయ్ లియో ను కొనుగోలు చేసి తెలుగులో విడుదల చేస్తోంది. మరి వారికి ఆ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.