లియో.. ఎంత బిజినెస్ చేసిందంటే..
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లియో.
By: Tupaki Desk | 15 Oct 2023 5:44 AM GMTఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లియో. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమైన ఈ సినిమాని 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే ఏకంగా 454 కోట్ల వరకు నిర్మాతకి తెచ్చిపెట్టింది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడి కంటే అధికంగా డబ్బులు వచ్చి పడ్డాయి.
విజయ్ కి జోడీగా ఈ చిత్రంలో త్రిష నటించింది. సంజయ్ దత్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా నటించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు, తమిళ్ భాషలలో ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్, విజయ్ ట్రాక్ రికార్డ్ ఈ మూవీపై హైప్ క్రియేట్ కావడానికి కారణం అని చెప్పాలి. కోలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ డీల్స్ జరిగిన మూవీగా లియో నిలిచింది.
ఈ సినిమా థీయాట్రికల్ లెక్కలు చూసుకుంటే అన్ని ఏరియాలలో భారీ ధరలకి అమ్ముడయ్యాయి. తమిళనాడులో 100 కోట్ల బిజినెస్ ఈ లియో సినిమాపై జరిగింది. తరువాత ఓవర్సీస్ లో అత్యధికంగా 60 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగులో 21 కోట్లకి హక్కులని సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. కర్ణాటకలో 13 కోట్ల బిజినెస్ జరిగింది. కేరళలో 16 కోట్ల వ్యాపారం లియో మూవీపైన అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్ల వరకు జరిగింది.
ఇలా ఓవరాల్ గా 218 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ లియో సినిమాపైన జరిగింది. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో లియో మూవీ రిలీజ్ కాబోతోంది. నాన్ థీయాట్రికల్ లెక్కలు చూసుకుంటే డిజిటల్ రైట్స్ 140 కోట్లకి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ 80 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇక మ్యూజిక్ రైట్స్ తో 16 కోట్ల వరకు వచ్చింది. మొత్తం 236 కోట్ల నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా లియో మూవీతో నిర్మాత సంపాదించారు.
ఓవరాల్ గా 454 కోట్లు లియో సినిమాపై బిజినెస్ జరిగిందని దీనిని బట్టి అర్ధమవుతోంది. విజయ్ కెరియర్ లోనే కాకుండా కోలీవుడ్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా లియో సినిమా ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. అలాగే మూవీ కూడా రిలీజ్ తర్వాత కచ్చితంగా కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని దళపతి ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.