Begin typing your search above and press return to search.

మలయాళం బాక్సాఫీస్.. టాప్ 5 సినిమాలు ఇవే!

కంటెంట్ బేస్డ్ గా మలయాళం దర్శకులు ఎక్కువగా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటారు.

By:  Tupaki Desk   |   13 March 2024 7:04 AM GMT
మలయాళం బాక్సాఫీస్.. టాప్ 5 సినిమాలు ఇవే!
X

తెలుగు, తమిళ్, హిందీ భాషలతో పోల్చుకుంటే మలయాళం మూవీ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది. అక్కడ స్టార్ హీరోల సినిమాలకి కూడా 20 నుంచి 30 కోట్లకి మించి బడ్జెట్ కావు. హీరోల రెమ్యునరేషన్ లు కూడా తక్కువగా ఉంటాయి. అయితే సినిమా అవుట్ ఫుట్ విషయంలో మాత్రం అందరికంటే వారే బెస్ట్ అనే గుర్తింపు సొంతం చేసుకున్నారు. కంటెంట్ బేస్డ్ గా మలయాళం దర్శకులు ఎక్కువగా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటారు.

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమాల సక్సెస్ రేట్ కూడా మలయాళంలోనే ఎక్కువగా ఉంటుంది. లోబడ్జెట్ తో అద్భుతమైన కథలతో అక్కడి దర్శకులు సినిమాలు చేస్తారు. అలాగే హీరోలు కూడా స్టార్ ఇమేజ్ అని చూడకుండా కంటెంట్ నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి అయిన రెడీ అయిపోతారు. అయితే మలయాళం ఇండస్ట్రీలో వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.

వంద కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసిందంటే అది బ్లాక్ బస్టర్ సినిమాగా పరిగణించవచ్చు. మలయాళంలో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న మూవీ అంటే 2018 అని చెప్పాలి. టోవినో థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ మూవీ కేరళంలో వచ్చిన భారీ తుఫాన్ నేపథ్యంలో రియల్ స్టోరీగా తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఏకంగా 174.35 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. 26 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.

రీసెంట్ గా వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ అనే మూవీ 19 రోజుల్లో ఏకంగా 167 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతోంది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన పులిమురుగన్ మూవీ 140.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 3లో ఉంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ 128.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ హిట్ అయ్యింది. గత నెల ప్రేమలు అనే చిన్న మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఏకంగా 101 కోట్ల గ్రాస్ ని 32 రోజుల్లో అందుకుంది. ఈ సినిమాని కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే కంటెంట్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావడంతో మూవీకి హిట్ టాక్ వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.

టాప్ 5 మలయాళ సినిమాల వరల్డ్ వైడ్ గ్రాస్:-

1) 2018 మూవీ : ₹174.35 కోట్లు

2) మంజుమ్మెల్ బాయ్స్ ~ ₹167.00 కోట్లు (19 రోజులు) *

3) పులిమురుగన్ : ₹140.05 కోట్లు

4) లూసిఫర్ : ₹128.10 కోట్లు

5) ప్రేమలు ~ ₹101.00 కోట్లు (32 రోజులు) *