Begin typing your search above and press return to search.

MI7 భార‌త‌దేశంలో ఎంత వ‌సూలు చేసింది?

టామ్ క్రూజ్ న‌టించిన‌ `మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1` అత్యంత భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేరుతోంది. భార‌తదేశం నుంచి ఈ సినిమా ఇప్ప‌టికే 80 కోట్లు పైగా వ‌సూలు చేసింది.

By:  Tupaki Desk   |   22 July 2023 3:41 PM GMT
MI7 భార‌త‌దేశంలో ఎంత వ‌సూలు చేసింది?
X

టామ్ క్రూజ్ న‌టించిన‌ `మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1` అత్యంత భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేరుతోంది. భార‌తదేశం నుంచి ఈ సినిమా ఇప్ప‌టికే 80 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించారు. రెబెక్కా ఫెర్గూసన్ - హేలీ అట్‌వెల్- వెనెస్సా కిర్బీ- సైమన్ పెగ్ త‌దిత‌రులు న‌టించారు. ఎం.ఐ7 రెండవ శుక్రవారం భారతదేశంలో 2.40 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నోల‌న్ తెర‌కెక్కించిన ఓపెన్ హైమ‌ర్ అత్యంత భారీగా రిలీజ్ కావ‌డంతో ఈ చిత్రం తన ప్రీమియం స్క్రీన్ లన్నింటినీ ఓపెన్ హైమర్ కోసం వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. బార్బీ -ఓపెన్‌హైమర్ రెండింటి కారణంగా దాని ఇతర స్క్రీన్ లలో మెజారిటీ భాగాన్ని కోల్పోయింది. MI7 అనేది ఈ వారం దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మూడవ సినిమాగా మిగిలింది. 10 రోజుల నెట్ ఇండియా కలెక్షన్లు రూ. 82.80 కోట్లు కాగా ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్ వైపు దూసుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని భావించారు. కానీ ఇంత‌లోనే రెండు భారీ చిత్రాలు ఎం.ఐ7 వ‌సూళ్ల‌కు గండి కొట్టాయ‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1 భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ గా రికార్డుల‌కెక్కింది. మిష‌న్ ఇంపాజిబుల్ 7 ఇప్ప‌టికే కొన్ని ప‌రిమిత థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఓపెన్ హైమ‌ర్ - బార్బీ నుండి పోటీ ఉన్నప్పటికీ రెండవ శుక్రవారం వ‌సూళ్లు ప్రశంసనీయం అంటూ ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇది మరికొంత కాలం పాటు స్థిరంగా నడపడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఫాస్ట్ X మరియు మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రాల త‌ర‌హాలో `ఓపెన్ హైమర్‌` ఎక్కువ మైలేజీని కలిగి ఉండదని భావిస్తున్నారు. ఫాస్ట్ X తర్వాత ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ హాలీవుడ్ చిత్రంగా ఎం.ఐ7 నిల‌స్తుంద‌ని అంచ‌నా. M:I7 ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ డాలర్ల వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది. లైఫ్ టైమ్ కలెక్షన్స్ ప్రస్తుతం 500 మిలియన్ డాలర్ల రేంజ్ లో ఉన్నట్లు అంచ‌నా వేస్తున్నారు.

మిషన్: ఇంపాజిబుల్ 7 ఇండియాలో రోజు వారీగా నెట్ :-

1వ రోజు - రూ. 12.25 కోట్లు

2వ రోజు - రూ. 8.75 కోట్లు

3వ రోజు - రూ. 9.25 కోట్లు

4వ రోజు - రూ. 16.25 కోట్లు

5వ రోజు - రూ. 17.50 కోట్లు

6వ రోజు - రూ. 4.75 కోట్లు

7వ రోజు - రూ. 4.25 కోట్లు

8వ రోజు - రూ. 3.90 కోట్లు

9వ రోజు - రూ. 3.50 కోట్లు

10వ రోజు - రూ. 2.40 కోట్లు

మొత్తం 10 రోజుల్లో రూ. 82.80 కోట్లు వసూలైంది.

ఎంఐ 7 క‌థాంశం..

ఏఐ ఆధారిత‌ IMF `కీ` దుష్ఠ‌శ‌క్తుల‌ చేతుల్లో పడితే మొత్తం మానవాళికి ప్రాణాంతకమైన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. కానీ దానిని ఆపేందుకు క‌థానాయ‌కుడు ఏతాన్ హంట్ ఎలాంటి సాహ‌సాలు చేశాడ‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. భవిష్యత్తుపై నియంత్రణతో ప్రపంచం విధి ప్రమాదంలో ఉండటంతో క‌థానాయ‌కుడి అస‌లు సాహసం ప్రారంభమవుతుంది. ఒక రహస్యమైన శత్రువును ఎదుర్కొన్న ఏతాన్ మిషన్ కంటే మరేమీ ముఖ్యమైనది కాదని భావించవలసి వస్తుంది. అతడు ఎక్కువగా పట్టించుకునే వారి జీవితాలను కూడా కాదనుకోవాల్సి వ‌స్తుంది. చివ‌రికి ఏతాన్ మిష‌న్ పూర్త‌యిందా లేదా? అన్న‌దే ఈ సినిమా.