Begin typing your search above and press return to search.

రిలీజ్ కి ముందే 'ఓపెన్ హెయిమ‌ర్' హెచ్చ‌రిక‌!

అందుకే ఇంత‌లా ఓపెన్ హెయిమ‌ర్ కోసం భార‌తీయులు పోటీ ప‌డుతున్నారు. ఈ సినిమా కూడా కేవ‌లం హిందీ డ‌బ్బింగ్ తో మాత్ర‌మే వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   20 July 2023 6:42 AM GMT
రిలీజ్ కి ముందే ఓపెన్ హెయిమ‌ర్ హెచ్చ‌రిక‌!
X

ఇండియాలో హాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మెట్రోపాలిట‌న్ సిటీస్ హైద‌రాబాద్ ..బెంగ‌ళూర్..వైజాగ్.చెన్నై..కోల్ క‌త్తా లాంటి ప‌ట్ట‌ణాల్లో హాలీవుడ్ సినిమాలంటే జ‌నాలు ఎగ‌బ‌డిచూస్తారు. ఇప్పుడీ క‌ల్చ‌ర్ చిన్న చిన్న ప‌ట్ట‌ణాల‌కు పాకుతుంది.

అందుకే ఇండియాలో సైతం హాలీవుడ్ సినిమాలు కోట్ల వ‌సూళ్ల సునాయాసం సాధిస్తున్నాయి. అందులోనూ కొన్ని ఫేమ‌స్ నిర్మాణ సంస్థ‌లు...ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు చేసిన సినిమాల కోసమైతే భార‌తీయులు కూడా ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తుంటారు.

తాజాగా జులై 21న రిలీజ్ అవుతోన్న 'ఓపెన్ హెయిమ‌ర్' సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు అన‌డానికి ఈ స‌న్నివేశ‌మే ఉదాహ‌ర‌ణ‌. కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో టిక్కెట్ ధ‌ర 2450 గా నిర్దారించారు. ఇంత ధ‌ర‌తో ఎవ‌రు కొంటారు? అని ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

అంత పెట్టినా టిక్కెట్ దొర‌క‌ని ప‌రిస్థితి ఉంది. ముంబై పీవీఆర్ మ‌ల్టీప్లెక్స్ లో బుకింగ్స్ ఓపెన్ కాగానే హాట్ కేకుల్లా అమ్మ‌డు పోయాయి. దీంతో బ‌య‌ట సోల్డ్ ఔట్ బోర్ట్ పెట్టేసారు. రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులు ముందుగా జ‌రిగిన సంఘ‌ట‌న ఇది.

ఇప్పుడైతే ఎక్క‌డా టిక్కెట్ దొరికే ప‌రిస్థితి కూడా ఉండ‌దు. ఈ క్రేజ్ కి కార‌ణం ద‌ర్శ‌కుడు క్రిస్టోప‌ర్ నోలన్.ఆయ‌న తెర‌కెక్కించిన 'డార్క్ నైట్'..' నైట్ రైజెస్'.. 'ఇంట‌ర్ స్టెల్లార్'..'ఇన్సెప్ష‌న్'..'స్పైడ‌ర్ మ్యాన్'..'అవెంజ‌ర్స్'.. 'మమ్మి' లాంటి సిరీస్ ల‌కు ఇక్క‌డ ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు.

అప్ప‌ట్లో ఇండియాలో స్పెష‌ల్ షోలు వేస్తే కోట్ల రూపాయాలు రాబ‌ట్టాయి. అందుకే ఇంత‌లా ఓపెన్ హెయిమ‌ర్ కోసం భార‌తీయులు పోటీ ప‌డుతున్నారు. ఈ సినిమా కూడా కేవ‌లం హిందీ డ‌బ్బింగ్ తో మాత్ర‌మే వ‌స్తోంది.

ఇంత‌ర భాష‌ల్లో డ‌బ్ చేయ‌డానికి స‌ద‌రు కంపెనీ అంగీక‌రించ‌లేదు. అంటే ఇండియాలో హాలీవుడ్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ స‌న్నివేశం ద్వారా అర్ద‌మ‌వుతోంది. ఈ సినిమాతో పాటు తెలుగు సినిమాలు 'హిండ‌బి'..'అన్న‌పూర్ణ ఫోటో స్టూడియో'లాంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

వీటికి పెద్ద‌గా బుకింగ్స్ క‌నిపించ‌లేదు. కానీ ఓ ఇంగ్లీష్ సినిమా కోసం జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు. అంటే తెలుగులో ఓ హాలీవుడ్ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధ‌మ‌వుతోంది.