Begin typing your search above and press return to search.

అయ్యో.. ఫోటో స్టూడియో దెబ్బడిపోయింది.. మళ్ళీ 'బేబీ'నే

పీరియాడిక్ క‌థ‌ల‌తో చిన్న చిత్రాలను నిర్మించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. క‌థ‌కు తగ్గట్టుగా ఆ వాతావ‌ర‌ణాన్ని సృష్టించి షూట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ప్రయత్నంతో రీసెంట్​గా 'అన్న‌పూర్ణ ఫొటోస్టూడియో' చిత్రం వచ్చింది.

By:  Tupaki Desk   |   23 July 2023 5:50 AM GMT
అయ్యో.. ఫోటో స్టూడియో దెబ్బడిపోయింది.. మళ్ళీ బేబీనే
X

పీరియాడిక్ క‌థ‌ల‌తో చిన్న చిత్రాలను నిర్మించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. క‌థ‌కు తగ్గట్టుగా ఆ వాతావ‌ర‌ణాన్ని సృష్టించి షూట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ప్రయత్నంతో రీసెంట్​గా 'అన్న‌పూర్ణ ఫొటోస్టూడియో' చిత్రం వచ్చింది. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలో సాగే ఓ ప్రేమ‌ క‌థ‌తో ఇది రూపొందిందీ చిత్రం. రెట్రో కామెడీ కమ్​ క్రైమ్ డ్రామాగా తీశారు.

అయితే ఇలాంటి చిన్న సినిమాలను సాధారణంగా ఓటీటీలో అయితే ఆదరిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా థియేటర్లకు పరుగులు పెట్టి చూసే ప్రేక్షకులు ఉండరు. కాదు అప్పటికీ చూడాలంటే.. ఆ చిత్రం ఇంకేదో అద్భుతం చేయాలి. అలాగే అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ ఇవేమీ కాదు కదా.. కనీసం బాగుంది అన్న టాక్​ను కూడా తెచ్చుకోలేకపోయింది.

వాస్తవానికి ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో బాగానే ఆసక్తిని క్రియేట్​ చేసిందే అని అనిపించుకుంది. పైగా ఈ చిత్రంలో.. విభిన్న‌మైన క‌థ‌ల‌తో మెప్పిస్తున్న చైత‌న్య‌రావ్ క‌థానాయ‌కుడిగా నటించడం, 'పెళ్లిచూపులు', 'డియ‌ర్ కామ్రేడ్' వంటి హిట్​ చిత్రాల నిర్మాణంలో భాగ‌మై రావడం.. వంటి అంశాలు కూడా సినిమాకు బాగా కలిసొస్తాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. సినిమా చతికిలపడిపోయింది.

'ఓ పిట్ట క‌థ‌' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చెందు ముద్దు రెండో ప్ర‌య‌త్నం బోల్తా కొట్టినట్టైంది. ఈ ఫోటో స్టూడియో ఆడియెన్స్​ను ఇంప్రెస్​ చేయలేకపోయింది. సినిమా రిలీజై రెండు రోజులైనా ప్రేక్షకులు ఎవరూ చూడటానికి ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. వీకెండ్ వచ్చినా ఎవరూ పట్టించుకోకపోయేసరికి మల్టీప్లెక్సుల్లో షాలను క్యాన్సిల్ చేశరాని సమాచారం అందింది. హాఫ్ బాయిల్డ్​ టాక్​ రివ్యూ బయటికి రావడం వల్ల.. వీకెండ్​లోనూ ఎవరూ సినిమాకు రావట్లేదట.

ఈ ఒక్క సినిమానే కాదు ఈ వారం వచ్చిన చిన్న సినిమాల పరిస్థితి అన్ని ఇంతేనట. బిచ్చగాడు 2 ఫేమ్​ విజయ్ ఆంటోనీ 'హత్య' కూడా ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. అయితే ఇంగ్లీష్ చిత్రాలు ఓపెన్ హెయిమర్, బార్బీలు బాగానే ఉన్నాయ. కానీ తెలుగు ప్రేక్షకులకు నేటివిటీకీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి... గత వారం రిలీజై ఆకట్టుకున్న 'బేబీ'కే ఆసక్తి చూపుతున్నారట. దీంతో తిరిగి బేబీనే ఊపందుకుందట.