సలార్ బిజినెస్.. రూ.800 కోట్ల టార్గెట్!
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి.
By: Tupaki Desk | 15 July 2023 8:19 AM GMTప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ఒక రేంజ్ లో క్లిక్ అయింది. సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.
అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న హోంబెల్ ఫిలిమ్స్ వారు డిమాండ్ కు తగ్గట్టుగానే భారీ స్థాయిలో బిజినెస్ చేయాలి అని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. చూస్తుంటే సలార్ సినిమా బాక్సాఫీస్ పరీక్ష కంటే ముందే మార్కెట్లో 800 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా సలార్ సినిమాకు నార్త్ ఇండస్ట్రీలో అయితే మంచి డిమాండ్ ఉంది.
అయితే నిర్మాతలు అక్కడ మాత్రం సొంతంగా విడుదల చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక కన్నడలో కూడా సొంతంగానే విడుదల చేసుకోబోతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అయితే కేవలం తెలుగులోనే సినిమా హక్కులను బడా నిర్మాణ సంస్థలకు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 200 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ ద్వారా టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్ లో కూడా రిస్క్ లేకుండా అక్కడ కూడా థియేట్రికల్లో రైట్స్ ద్వారా సలార్ సినిమా 80 కోట్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూస్తే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 500 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ గా కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడినట్లుగా ఇదివరకే టాక్ వినిపించింది.
డిజిటల్ శాటిలైట్ అలాగే ఆడియో రైట్స్ ద్వారా ఈ సినిమా మరో 300 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందట. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే సలార్ సినిమా విడుదలకు ముందే 800 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసే ఛాన్స్ ఉంది. ఒక విధంగా పెట్టిన పెట్టుబడికి ఇది నిర్మాతలకు జాక్ పాట్ అని చెప్పవచ్చు. మరి విడుదల తర్వాత సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.