Begin typing your search above and press return to search.

500 కోట్లతో 5000 కోట్లు సాధ్యమయ్యే పనేనా..!

బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. బాహుబలితో ప్రభాస్ మార్త్రమే కాదు తెలుగు సినిమా మార్కెట్ కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఆ సినిమా నుంచి ప్రభాస్ సినిమా అంటే ఒకదానికి మించి మరోటి అనిపించేలా చేస్తున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ ఆదిపురుష్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   24 July 2023 5:52 AM GMT
500 కోట్లతో 5000 కోట్లు సాధ్యమయ్యే పనేనా..!
X

బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. బాహుబలితో ప్రభాస్ మార్త్రమే కాదు తెలుగు సినిమా మార్కెట్ కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఆ సినిమా నుంచి ప్రభాస్ సినిమా అంటే ఒకదానికి మించి మరోటి అనిపించేలా చేస్తున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ ఆదిపురుష్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు. ఇక మరోపక్క సెప్టెంబర్ లో ప్రభాస్ సలార్ అంటూ రాబోతున్నాడు. ఆ సినిమా మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంది.

ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న కల్కి 2898 AD కూడా నెక్స్ట్ లెవెల్ లో రాబోతుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తే తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిందని నమ్మేలా చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా కూడా సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా యూఎస్ లో కామిక్ కాన్ లో జరిగిన టీజర్ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు సినిమాగా తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా టీజర్ తోనే హాలీవుడ్ ట్రీట్ అందించింది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరగడం పక్కా అని అనిపిస్తుంది. బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నా ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీగా రిలీజైతే మాత్రం 5000 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అని అంటున్నారు. 500 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 5000 కోట్లు కలెక్ట్ చేస్తే మాత్రం ఇండియన్ సినిమా స్టామినా మరోసారి పాన్ వరల్డ్ రేంజ్ లో తెలుస్తుందని చెప్పొచ్చు.

కల్కి 2898 AD సినిమా శాంపిల్ తోనే అరుపులు పెట్టించిన నాగ్ అశ్విన్ సినిమా మొత్తం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాడని చెప్పొచ్చు. సినిమాలో ప్రభాస్ మాత్రమే కాదు కమల్ హాసన్ కూడా ఉన్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నాడు అంటే ఆ సినిమా రేంజ్ పెరిగినట్టే. దీపిక పదుకొనె, అమితాబ్ ఇలా స్టార్స్ అంతా కలిసి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఇంతకీ కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంది. అసలైతే మేకర్స్ 2024 పొంగల్ రిలీజ్ అన్నారు కానీ సినిమా టీజర్ లో రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. 2024 సంక్రాంతి నుంచి సమ్మర్ కి సినిమా వాయిదా పడుతుందని టాక్. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ కి కల్కి మూవీ ఐ ఫీస్ట్ అందించేలా ఉందని చెప్పొచ్చు.