Begin typing your search above and press return to search.

వెట్టయ్యన్ బాక్సాఫీస్ సంచలనం.. ఎంత వచ్చాయంటే..

ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉండటంతో, 7250 థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ "వెట్టయ్యన్ ది హంటర్" కూడా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన పొందుతోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:27 PM GMT
వెట్టయ్యన్ బాక్సాఫీస్ సంచలనం.. ఎంత వచ్చాయంటే..
X

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన "వెట్టయ్యన్" సినిమా ప్రపంచవ్యాప్తంగా సాలిద్నరెస్పాన్స్ తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ సంవత్సరంలో అత్యధికంగా వసూలు చేసిన భారతీయ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

"వెట్టయ్యన్" విజయం అనేక కారణాలతో సాధ్యమైంది. రజనీకాంత్ అద్భుతమైన స్టార్ పవర్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరుల తారాగణం అద్భుతంగా నటించారు. దర్శకుడు టీజే జ్ఞాన్ వెల్ రాజా కథనాన్ని చాలా ఆసక్తికరంగా మలిచారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉండటంతో, 7250 థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ "వెట్టయ్యన్ ది హంటర్" కూడా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన పొందుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ LLP భారీ స్థాయిలో విడుదల చేసింది. అలాగే శ్రీలక్ష్మి మూవీస్ సీడెడ్‌ ప్రాంతంలో విడుదల చేసింది. సినిమా ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుంది.

లైకా ప్రొడక్షన్స్‌ వ్యవస్థాపకుడు సుబాస్కరన్ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, "ఈ చిత్రం మా టీమ్ శ్రమకు ఫలితం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు," అని తెలిపారు. "వెట్టయ్యన్"కు రెడ్ జైంట్ మూవీస్ పంపిణీదారులుగా ఉన్నారు. సినిమా కథనంలో న్యాయం, అధికార దుర్వినియోగం, అవినీతిపై ప్రాముఖ్యాన్ని సంతరించుకోవడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై చిత్రంలో చూపించిన సన్నివేశాలు ఓ వర్గం ఆడియెన్స్ ను ఆలోచిపజేశాయి.

తాజాగా "వెట్టయ్యన్" అందించిన విజువల్ ట్రీట్ సాంకేతికంగా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో రంగులు, లైటింగ్, ఫ్రేమింగ్‌ను వినియోగించిన తీరు కథనాన్నే కొత్త స్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్ సన్నివేశాలను అత్యంత ఆకర్షణీయంగా చూపించడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తోంది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం, అత్యున్నత స్థాయి భారతీయ సినిమాల సరసన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. బలమైన కథ, రజనీకాంత్ అంతులేని క్రేజ్, టీజే జ్ఞాన్ వెల్ ప్రతిభ, మొత్తం టీమ్ కృషితో "వెట్టైయన్" సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.