Begin typing your search above and press return to search.

టైగర్ 3.. బాక్సాఫీస్ అలెర్ట్!

'ప‌ఠాన్' త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ 2023 మూవీస్ లిస్ట్​లో 'టైగ‌ర్-3' చిత్రం ఒకటి.

By:  Tupaki Desk   |   3 Sep 2023 3:30 AM GMT
టైగర్ 3.. బాక్సాఫీస్ అలెర్ట్!
X

'ప‌ఠాన్' త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ 2023 మూవీస్ లిస్ట్​లో 'టైగ‌ర్-3' చిత్రం ఒకటి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్​ హీరోగా భారీ బడ్జెట్​తో ఇది తెరకెక్కుతోంది. 'ఏక్ ది టైగర్', 'టైగర్ జిందాహై' వంటి సూపర్ హిట్​ సినిమాలకు సీక్వెల్​గా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ బడ్జెట్​తో రానున్న ఈ యాక్షన్​ ఎంటర్​టైనర్​ మూవీ.. సల్మాన్ ఖాన్ కెరీర్​లోనే హూజ్ ఎక్స్పెక్టేషన్స్​తో రూపొందుతోంది.

ఈ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్​లో ఉన్న భాయ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​ను సల్మాన్​ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది దిపావళికి రానున్నట్లు మరోసారి కన్ఫామ్​ చేశారు. "వచ్చేస్తున్నాను. 2023 దివాళీకి టైగర్ 3తో బిగ్​స్క్రీన్స్​లో సెలబ్రేట్​ చేసుకుందాం. హిందీ, తమిళం, తెలుగులో సినిమా రాబోతుంది" అంటూ సల్మాన్ క్యాప్షన్​ రాసుకొచ్చారు.

ఈ రిలీజ్ డేట్​ అనౌన్స్​మెంట్​తో పాటు కొత్త పోస్టర్‌ కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్​లో సల్మాన్-కత్రినా మెషీన్​ గన్స్​తో యాక్షన్​ సీక్వెన్స్​లో కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్​ పనులను జరుపుకుంటోంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో యశ్​ రాజ్​స్పై యూనివర్స్ బ్యానర్​పై ఈ చిత్రం రూపొందుతోంది. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రంలో సల్మాన్​తో పాటు అలనాటి అందాల తార రేవతి మరోసారి కలిసి నటింది. సల్మాన్‌ భాయ్​ను కమాండ్ చేసే రా ఆఫీసర్‌ పాత్రలో రేవతి కనిపించనుందని ఇన్‌సైడ్‌ టాక్‌ వినిపిస్తోంది. టైగర్‌ ప్రాంఛైజీలో వస్తున్న సినిమా కావడం వల్ల అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ బాద్​షా షారూక్​ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

ఈ 'టైగర్ 3'కి ముందు, సల్మాన్-షారుక్​ కలసి సిద్ధార్థ్ ఆనంద్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్‌లో కలిసి కనిపించారు. అలాగే సల్మాన్​తో పాటు టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీ కూడా నటించారు. విలన్​ రోల్ పోషించారు. కత్రినా కైఫ్ హీరోయిన్​గా నటించింది. ఇంకా సినిమాలో అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి ఇతర కీలక పాత్రల్లో నటించారు.