Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలు పెద్ద సక్సెస్

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సక్సెస్ రేట్ పెరిగిందని చెపుచ్చు. మిగిలిన చిత్రపరిశ్రమలతో పోల్చుకుంటే ఈ ఏడాదిలో అత్యధిక విజయాలు అందుకున్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ఉంది

By:  Tupaki Desk   |   30 July 2023 5:00 AM GMT
చిన్న సినిమాలు పెద్ద సక్సెస్
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సక్సెస్ రేట్ పెరిగిందని చెపుచ్చు. మిగిలిన చిత్రపరిశ్రమలతో పోల్చుకుంటే ఈ ఏడాదిలో అత్యధిక విజయాలు అందుకున్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ఉంది. జనవరి నుంచి చూసుకుంటే ప్రతి నెల కనీసం ఒకటి, రెండు సినిమాలు సక్సెస్ జాబితాలోకి వస్తున్నాయి. జులై నెలలో కూడా మొదటి వారం నుంచి ఇప్పటి వరకు పది చిత్రాల వరకు రిలీజ్ అయ్యాయి.

వీటిలో బ్రో బిగ్ బడ్జెట్ మూవీగా ఉంది. మిగిలినవన్నీ చిన్న చిత్రాలే కావడం విశేషం. బ్రో మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యి ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అది ఏ మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకొని సక్సెస్ వైపు వెళ్తుందనేది వీకెండ్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది. రంగబలి, జగపతిబాబు రుద్రాంగి, శ్రీసింహ భాగ్ సాలె, అశ్విన్ బాబు హిడింబ, సామజవరగమన, బేబీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి వచ్చినవే కావడం విశేషం.

అయితే వీటిలో అతి పెద్ద విజయం అందుకున్న మూవీగా బేబీ చిత్రం నిలిచింది. ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటికి స్థిరంగా కొనసాగుతూ 80 కోట్లని క్రాస్ చేసింది. దీని తర్వాత శ్రీవిష్ణు సామజవరగమన మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 50 నుంచి 60 కోట్ల మధ్య కలెక్షన్స్ ని ఈ చిత్రం రాబట్టింది. శ్రీవిష్ణు కెరియర్ లో అతి పెద్ద హిట్ సినిమాగా ఇది నిలిచింది.

బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య ఏకంగా క్రేజీ యాక్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీతో నిర్మాతలు అగ్రిమెంట్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హిడింబ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన థ్రిల్లింగ్ మూవీగా రిలీజ్ అయ్యింది. మొదటిరోజు పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నా కూడా వీకెండ్ తర్వాత ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది.

ఈ నెలలో మాత్రం బేబీ, సామజవరగమన చిత్రాలు టాప్ చైర్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక బ్రో సినిమా హిట్ అయిన కూడా చిన్న చిత్రాలకి వచ్చిన కలెక్షన్స్ రేషియోతో పోల్చుకుంటే మూడో స్థానంలోనే ఉండే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.