ఈ వారం బాక్సాఫీస్.. రెండు చిత్రాలతోనే అసలు సందడి
అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ ముందు భారీ సందడి వాతావరణం నెలకొంది.
By: Tupaki Desk | 27 July 2023 8:34 AM GMTటాలీవుడ్లో గత రెండు, మూడు వారాలుగా అన్ని చిన్న చిత్రాలే ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్క పెద్ద సినిమా కూడా ఏదీ రాలేదు. వీటిన్నింటిలో కేవలం శ్రీవిష్ణు నటించిన 'సామజవరగమణ', ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య 'బేబీ' మాత్రం సన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ ముందు భారీ సందడి వాతావరణం నెలకొంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా యంగ్ హీరో సాయి తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ 'బ్రో'.
ఇంకో రోజులో అంటే జులై 28న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ బ్రో చిత్రంతో మరో రెండు చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వాటిలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్' ఒకటి కాగా.. ఇంకోటి బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ - అలియా భట్ కలిసి నటించన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'.
అయితే ఈ చిత్రాల్లో మొదటగా అందరి ఫోకస్ 'బ్రో' పైనే ఉంటుంది. ఎందుకంటే మామాఅల్లుళ్లు కలిసి నటించిన చిత్రమిది. అందులో పైగా మెగా ఫ్యామీలికి చెందిన ఇద్దరు హీరోలు కలిసి ఒకే స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం మరింత విశేషం.
ఈ సినిమా తమిళ సూపర్ హిట్ వినోదయ సీతమ్‌కు రీమేక్ ఇది. ఏదిఏమైనా పవన్ సినిమా కాబట్టి.. ప్రేక్షకులు ఈ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ కచ్చితంగా వెళ్తారు. మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి.
ఇక దీని తర్వాత సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. బ్రో టికెట్లు మిస్ అయిన వాళ్లు ఈ చిత్రానికి కచ్చితంగా వెళ్తారు. బ్రహ్మాజీ, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫన్ కామెడీగా తెరకెక్కింది.
ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందర్నీ ఆకర్షించింది. ప్రమోషన్స్ కూడా బాగా డిఫరెంట్‌గా చేశారు. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు శునకాన్ని పెళ్లి చేసుకోవడంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ వివాహం వల్ల ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వంటి విషయాలతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 29న రిలీజ్ కానుంది.
ఇక మిగిలింది బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ - అలియా భట్ కలిసి నటించన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'. జులై 28న ఇది రానుంది. దీనికి కరణ్ జోహార్ తెరకెక్కించారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడే అవకాశం లేదు. కథ బాగుందని టాక్ వస్తే ఆలియాభట్‌కు ఉన్న కాస్త క్రేజ్‌తో చూడొచ్చు.