హైరేంజ్ లో ఓవర్సీస్ రేట్లు.. ఎవ్వరూ తగ్గట్లేదుగా
చిత్రసీమలో వచ్చిన మార్పుల వల్ల సినిమా పరిధి ఎప్పుడో దాటిపోయింది. మన సినిమా పరాయి దేశాల్లో, పరాయి సినిమాలు మన దేశంలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుని కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్ లను సృష్టిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 July 2023 11:20 AM GMTచిత్రసీమలో వచ్చిన మార్పుల వల్ల సినిమా పరిధి ఎప్పుడో దాటిపోయింది. మన సినిమా పరాయి దేశాల్లో, పరాయి సినిమాలు మన దేశంలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుని కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్ లను సృష్టిస్తున్నాయి. అందుకే సినిమా బడ్జెట్ లెక్కలు వేసుకునేటప్పుడే.. ఓవర్సీస్ మార్కెట్ ను సైతం దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు దర్శనిర్మాతలు. అంతేకాదు ఓ సినిమా రిలీజవ్వగానే ఓవర్ సీస్ కలెక్షన్స్ ఎంత అనే టాపిక్.. ట్రేడ్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంటుంది.
ముఖ్యంగా మన తెలుగు సినిమా బిజినెస్ కు ఓవర్ సీస్ లో మార్కెట్ బాగా పెరుగుతోంది. క్రమక్రమంగా మన చిత్రాలకు డిమాండ్ ఎక్కవవుతోంది. అక్కడ విడుదలైన ప్రతి సినిమాకు కూడా మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఇక్కడ రెవెన్యూ పరంగా దెబ్బతిన్నప్పటికీ.. ఓవర్ సీస్ కలెక్షన్స్ వల్ల బయటపడిపోతున్నాయి.
అయితే ఇది ఓ రకంగా మంచి విషయమే. కానీ దీని వల్ల మన నిర్మాతలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ సినిమాలకు ఓవర్ సీస్ రేట్లు కాస్త గట్టిగానే చెబుతున్నారని తెలుస్తోంది.
అయితే బయ్యర్లు కూడా సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్స్ కు వచ్చిన రెస్పాన్స్.. అలాగే హీరో స్టార్ డమ్ ను అంచనా వేసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నారు. కానీ కొన్ని చిత్రాల విషయంలో ఇది వర్కౌట్ కావట్లేదు. స్టార్ హీరో సినిమా అయినప్పటికీ.. ఓవర్సీస్ బయర్స్ కొన్ని సందర్భాల్లో నిర్మాతల చెప్పిన రేటుకు ముందుకు రావట్లేదని తెలిసింది.
రీసెంట్ గా... మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న ఓ బడా హీరో నటించిన సినిమాకు ఓవర్సీస్ లో బేరం అవ్వలేదని తెలిసింది. ఆ చిత్ర నిర్మాతలు రూ.18 కోట్లు చెప్పగా.. ఓవర్సీస్ బయర్స్ ముందుకు రాలేదట. అప్పటికీ నిర్మాతలు కాస్త దొగొచ్చి రూ. 12 కోట్లు అన్నారట. అయినా కూడా బయర్స్.. ఆ చిత్రానికి రూ.9 కోట్లు కన్నా ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధపడలేదట. అందుకు కారణం ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడమని తెలిసింది. దీంతో చేసేదేమి లేక ఆ సినిమా నిర్మాత.. ఓవర్సీస్ లో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు.
తాజాగా మార్కెట్ లో అందుతున్న సమాచారం ప్రకారం.. ఓవర్సీస్ లో బేరాలు సెటిల్ కావాల్సిన సినిమా రేట్లు ఇలా ఉన్నాయని తెలిసింది. పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం రూ.18కోట్లు, నాని హాయ్ నాన్న రూ.8కోట్లు, రామ్ పోతినేని-బోయపాటి స్కంద రూ.5కోట్లు, సూర్య కంగువ రూ.45కోట్లకు అమ్మాలని ఆయా చిత్రాల నిర్మాతలు అనుకుంటున్నారట. మరి బయర్స్ ఈ రేట్లకు కొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనప్పటికీ.. నిర్మాతలు మరీ ఓవర్ రేట్లకు పోకుండా, అలాగే బయర్స్ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా.. ఇద్దరూ సమన్వయం పాటిస్తూ తగిన రేటుకు సినిమాను రిలీజ్ చేయడం మంచిది.