అంబానీ కలల ప్రాజెక్ట్.. ఇది మరో "వరల్డ్".. ప్రత్యేకతలివే!
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్ పక్కన "జియో వరల్డ్ ప్లాజా రిటైల్ మాల్"ను ముంబయిలో ప్రారంభించారు.
By: Tupaki Desk | 1 Nov 2023 12:23 PM GMTప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి చెందిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన వాణిజ్య వ్యాపార కేంద్రాలు.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్ పక్కన "జియో వరల్డ్ ప్లాజా రిటైల్ మాల్"ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 7,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారలతో మరో "వరల్డ్" కళ్ల ముందు సాక్ష్యాత్కరించినంత పనైంది!
అవును... రిలయన్స్ లగ్జరీ మాల్ "జియో వరల్డ్ ప్లాజా" ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముకేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్ వస్త్రాల్లో మెరిశారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్ ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు.
ఈ జియో వరల్డ్ ప్లాజా మొత్తం నాలుగు అంతస్తుల్లో 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో ప్రత్యేకంగా లగ్జరీ ఫెసిలిటీలతో రిటైల్, డైనింగ్, లీజర్ కేటగిరీలు ఉన్నాయి. ఇదే సమయలో... 66 లగ్జరీ బ్రాండ్ ల రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. అదేవిధంగా... బాలెన్ సియాగా, పోటరీ బార్న్ కిడ్స్, జార్జియో అర్మానీ కేఫ్, శామ్ సంగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, మొదలైన ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ కేంద్రాలు ఉన్నాయి.
వీటితోపాటు... మనీష్ మల్హోత్రా, రాహుల్ మిశ్రా, ఫల్గుణి, అబు జానీ-సందీప్ ఖోస్లా, షేన్ పీకాక్, రి బై రీతు కుమార్ వంటి ప్రఖ్యాత డిజైనర్లకు కూడా ఈ జియో ప్లాజా నిలయంగా ఉంటుంది. ఇక ఈ ప్లాజా ను లోటస్ ఆకృతిలో డిజైన్ చేశారు. ప్రకృతిలోని వివిధ అంశాల నుండి ప్రేరణ పొంది ఈ డిజైన్ ను రూపొందించినట్లు చెబుతున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ సంస్థ టీవీఎస్, రిలయన్స్ టీం సంయుక్తంగా ఈ డిజైన్ ను రూపొందించారు.
ఈ మాల్ లో మొదటి లెవెల్ లో సందర్శకులను స్వాగతించే జితీష్ కల్లాట్ శిల్పం నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, గుడ్ క్యూరేటెడ్ గౌర్మెట్ ఫుడ్ ఎంపోరియం, ప్రపంచ స్థాయి రెస్టారెంట్ లతో ఉంటాయి. ఇక 3వ లెవల్స్ లో ఎంటర్‌టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో... దుకాణదారులు పూర్తిస్థాయిలో రిటైల్ ఎక్స్‌పీరియన్స్ పొందేలా... పర్సనల్ షాపింగ్, వీఐపీ కాన్సీర్జ్, టాక్సీ ఆన్ కాల్, వీల్ చైర్ సర్వీసులు, బ్యాగేజీ డ్రాప్ తో హ్యాండ్స్ ఫ్రీ షాపింగ్, బేబీ స్త్రోలర్, బట్లర్ సర్వీస్ వంటి మొదలైన సర్వీసులతో మరింతగా ఆకర్షించనున్నాయి.
ఈ విషయాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ స్పందించారు. ఇందులో భాగంగా... జియో వరల్డ్ ప్లాజా భారత్ లో అత్యుత్తమ గ్లోబల్ బ్రాండ్ లను తీసుకురావడమే కాకుండా టాప్ భారతీయ బ్రాండ్ ల నైపుణ్యాన్ని హైలైట్ చేయనుందని తెలిపారు. ఇదే సమయంలో ప్రతీ కస్ట్ మర్ కీ ప్రత్యేకమైన రిటైల్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు తెలిపారు.