రిచెస్ట్ పొలిటీషియన్ కొడుకు కూరగాయల వ్యాపారం!
అవును... కేవలం 11 లక్షల పెట్టుబడితో ఆర్యమాన్ తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. "మైమండీ" పేరుతో ఒక అప్లికేషన్ ను రన్ చేస్తూ ఉన్నాడు.
By: Tupaki Desk | 26 July 2023 6:54 AM GMTసాధారణంగా పొలిటీషియన్ కొడుకులు తిరిగి రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపిస్తుంటారని అంటుంటారు. వీరిలో ఇంకొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు పెడుతుంటారు. మరికొంతమంది విదేశాల్లో ఉంటుంటే.. ఇంకొంతమంది సినిమాలవైపు ఆకర్షితులవుతుంటారు. ఈ సమయంలో జ్యోతిరాధిత్య సింధియా కుమారుడి అంశం తెరపైకి వచ్చింది.
దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్లలో ఒకరు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ సంస్థానం వారసుడు అయిన జ్యోతిరాధిత్య సింధియా ప్రస్తుతం బీజేపీ నేత గా ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నరు. వాస్తవానికి సింధియాల రాజవైభోగం మామూలిది కాదని అంటుంటారు.
ఉదాహరణకు వీరి కుటుంబం ప్రస్తుతం నివాసం ఉండే భవంతి విలువే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు అని అంచనా! దాన్నిబట్టే వీరి ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు రావొచ్చు! ఇదే సమయంలో చాలా కాలంగా సింధియా ఫ్యామిలీ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిరాధిత్య కుమారుడు మహాన్ ఆర్యమాన్ సింధియా వ్యవహారం చర్చల్లోకి వచ్చింది.
ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన మహాన్ ఆర్యమాన్ లగ్జరీ లైఫ్ సంగతి తర్వాత... ముందు తనను తాను నిరూపించుకోవాలని భావించాడట. అలా అని వందల కోట్లతో వ్యాపారం స్టార్ట్ చేయలేదు.. కేవలం 11 లక్షలతో చిన్న కాయగూరల సప్లై వ్యాపారం ప్రారంభించాడు.
అవును... కేవలం 11 లక్షల పెట్టుబడితో ఆర్యమాన్ తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. "మైమండీ" పేరుతో ఒక అప్లికేషన్ ను రన్ చేస్తూ ఉన్నాడు. ఈయన రెండేళ్ల కిందటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ సమయంలో తొలి ఏడాదికే ఆ వ్యాపారం మంచి లాభాల బాటపట్టిందట.
ఏడాదిలో 60 లక్షల టర్నోవర్ స్థాయికి చేరిన ఈ వ్యాపారానికి... ఇటీవల అదనంగా 4.1 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా తోడయ్యిందంట. దీంతో.. ప్రస్తుతం ఈ వ్యాపారం మార్కెట్ వ్యాల్యూ ఐదు కోట్ల రూపాయలకు చేరిందని అంటున్నారు. ఏది ఏమైనా... రాజకుమారుడు ప్రారంభించిన ఈ వ్యాపారం దినదిన ప్రమార్ధమానంగా ఎదుగుతుంది.