తెలంగాణలో ఆ 95 మంది ఆస్తుల విలువ రూ.4,98,000 కోట్లు!
అవును... ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారలు చేస్తున్నవారిలో 95 మంది ఆస్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 31 Oct 2023 3:51 AM GMTభారతదేశంలో మల్టీ మిలియనీర్లకూ లోటుండదు.. మూడు పూటలా మెతుకు దొరకనివారికీ లోటుండదు.. ఈ విషయంలో కూడా భిన్నత్వలో ఏకత్వమే అనే కామెంట్లు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి! ఆ సంగతి అలా ఉంటే... దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణలో ఉన్న రిచ్చెస్ట్ పర్సన్ ఆస్తి విలువ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... కేవలం 95 మంది ధనవంతుల ఆస్తి విలువ రూ. రూ.4,98,000 కోట్లుగా ఉందని నివేధికలు చెబుతున్నాయి!
అవును... ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారలు చేస్తున్నవారిలో 95 మంది ఆస్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా వెయ్యి కోట్ల సంపద దాటిన 95 మంది రిచ్ పీపుల్ మొత్తంగా ఐదు లక్షల కోట్లకు దగ్గరగా సంపద కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఫార్మా రంగంలోని వ్యక్తుల మొత్తం ముందంజలో ఉండటం గమనార్హం!
ఇందులో భాగంగా.. రూ.55,700 కోట్ల రూపాయల వ్యక్తిగత సంపదతో డ్రగ్ మేకర్ దివీస్ ల్యాబ్స్ ప్రమోటర్ అయిన మురళీ దివి రాష్ట్రంలోని సంపన్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మేఘా ఇంజినీరింగ్ కు చెందిన పి.పిచ్చిరెడ్డి (రూ.37,300 కోట్లు), పివి కృష్ణారెడ్డి (రూ.35,800 కోట్లు), బి.పార్థసారధి రెడ్డి (రూ.21,900 కోట్లు), రామేశ్వర్ రావు జూపల్లి (రూ.17,500 కోట్లు) ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అంటే... 95 మంది రిచ్చెస్ట్ పీపుల్ లో మొదటి ఈ ఐదుగురు ఈ సంపదలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నారు. అంటే... 95 మంది మొత్తం సంపద రూ.4,98,000 కోట్లు కాగా... ఈ ఐదుగురి మొత్తమే రూ. 1,68,200 కోట్లుగా ఉంది. మిగిలిన 90 మంది వ్యక్తుల సంపదా రూ.3,29,800 కోట్లుగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... హైదరాబాద్ ఐటి హబ్ గా ఖ్యాతి పొందినప్పటికీ.. ఇప్పుడు చెప్పుకున్న లిస్ట్ లోని అత్యధిక ధనవంతులు ఫార్మాసుటికల్స్ రంగానికి సంబంధించినవారే! ఈ 95 మంది సంపన్న వ్యక్తుల్లో.. 23 మంది ఔషధాల తయారీ కంపెనీల వ్యవస్థాపకులు కాగా, వీరి సంపద ఏకంగా రూ.1,88,600 కోట్లు కావడం గమనార్హం.
ఇక ఈ ఫార్మాసుటికల్స్ రంగం అనంతరం నిర్మాణం, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన రంగాల నుండి వచ్చిన సూపర్ రిచ్ వ్యక్తుల ఈ లిస్ట్ లో రెండవ అతిపెద్ద సమూహంగా ఉన్నారు. ఈ జాబితాలో 20 మంది వ్యక్తులు ఉండగా... వారి నికర విలువ రూ.1,59,000 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో... ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆరుగురు వ్యక్తులు రూ.25,700 కోట్ల రూపాయల విలువైన సంపదను కూడబెట్టారు.
అదేవిధంగా... పారిశ్రామిక తయారీ సంబంధిత రంగాలలో 17 మంది అతి సంపన్న వ్యక్తుల సంపద రూ. 39,700 కోట్లు కాగా... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నగరంగా చెప్పుకునే ఏడుగురు సూపర్ రిచ్ వ్యక్తులు సంపద రూ.21,500 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.