సెన్సెక్ దూకుడు.. తొలినాళ్లలో 9ఏళ్లు.. ఇప్పుడు 9 నెలల కంటే తక్కువ!
సెన్సెక్స్ తొలిసారి తన జీవనకాల గరిష్ఠమైన 70వేల పాయింట్లను టచ్ చేసిన నేపథ్యంలో సెన్సెక్స్ మైలురాళ్లను చూసినప్పుడు ఆసక్తికర ప్రయాణం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 12 Dec 2023 5:19 AM GMTస్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని కొలిచే సెన్సెక్స్ పాయింట్లకు సంబంధించిన గతాన్ని.. వర్తమానాన్ని చూస్తే.. పెరిగిన వేగమే కాదు.. అంతకు మించిన జోరు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. సెన్సెక్స్ తొలిసారి తన జీవనకాల గరిష్ఠమైన 70వేల పాయింట్లను టచ్ చేసిన నేపథ్యంలో సెన్సెక్స్ మైలురాళ్లను చూసినప్పుడు ఆసక్తికర ప్రయాణం కనిపిస్తుంది.తొలినాళ్లలో 5వేల పాయింట్లను దాటేందుకు అక్షరాల 9 ఏళ్లకు పైనే పడితే.. అందుకు భిన్నంగా ఇప్పుడు అంతకు రెట్టింపు అయిన పది వేల పాయింట్లను దాటేందుకు 9 నెలలు కూడా పట్టకపోవటం చూస్తే.. సెన్సెక్స్ జోరు ఎంతలా ఉందన్నది ఇట్టే అర్తమవుతుంది.
1990 జులై 25 నాటికి దేశ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి వెయ్యి పాయింట్లను టచ్ చేసింది. వెయ్యి నుంచి 5వేల పాయిం్ట్లు చేరటానికి అంటే.. నాలుగువేల పాయింట్ల ప్రయాణానికి ఏకంగా 9ఏళ్లు (1999 అక్టోబరు 11) తీసుకుంది. 5వేల మార్కు నుంచి 10వేల మార్కుకు చేరటానికి కూడా దాదాపు ఐదున్నరేళ్ల కాలం పట్టింది. అయితే.. 10వేల నుంచి 20వేల పాయింట్లకు దూసుకెళ్లేందుకు మాత్రం 22నెలల సమయాన్నే తీసుకుంది.
20వేల మార్కు నుంచి 30వేల మార్కు ప్రయాణానికి దగ్గర దగ్గర ఆరున్నరేళ్లకు పైనే పట్టింది. 30వేల మార్కు నుంచి 40 వేల మార్కును టచ్ చేసేందుకు మాత్రం రెండేళ్ల కంటే తక్కవ కాలం పట్టటం గమనార్హం. 30వేల మార్కు 2017 ఏప్రిల్ 26న టచ్ చేస్తే.. 40వేల మార్కు 2019 మే 23నాటికి టచ్ అయ్యింది. 40వేల మార్కు నుంచి 50 వేల మార్కు చేరుకోవటానికి కేవలం 20 నెలలు పట్టింది.అయితే.. కరోనా కానీ లేకుండా అంతకంటే తక్కువ సమయమే తీసుకునే అవకాశం ఉంది.
50వేల మార్కు 2021 జనవరి 21న టచ్ చేస్తే.. 60వేల మార్కును 2021 సెప్టెంబరు 24 నాటికి చేరుకోవటం గమనార్హం. సెన్సెక్స్ చరిత్రలో దూకుడు ఒక రేంజ్ కు చేరిన సమయంగా దీన్ని చెప్పాలి. 2021 సెప్టెంబరు 60వేల మార్కు నుంచి 70వేల మార్కుకు చేరుకోటానికి మాత్రం మళ్లీ ఎక్కువ సమయం తీసుకుంది. 60వేల మార్కు 2021 సెప్టెంబరు 24న చేరుకుంటే.. అక్కడి నుంచి 70వేల మార్కును చేరుకోవటానికి 2023 డిసెంబరు 11 వరకు పట్గింది. మొత్తంగా చూస్తే.. తొలినాళ్లలో పడిన అడుగులకు.. ఇటీవల కాలంలో దూకుడుకు ఏ మాత్రం పొంతన లేదన్నది మాత్రం స్పష్టమవుతుంది.
ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే.. 65వేల నుంచి 70వేల పాయింట్లు చేరుకోవటానికి ఆర్నెల్ల కంటే తక్కువ సమయం పట్టింది. కేవలం 107 ట్రేడింగ్ రోజుల్లోనే సూచీ ఈ ఘనతను సొంతం చేసుకోవటం గమనార్హం. 2023 జులై 3న సెన్సెక్స్ 65వేల పాయింట్ల మార్కును అధిగమించింది. అంతకు ముందు నెలలో మొదటిసారి 64వేల పాయింట్లకు చేరుకుంది. మొత్తంగా రానున్న రోజుల్లోనూ సెన్సెక్స్ దూకుడు ఇదే తీరులో ఉంటుందన్న మాట మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.