Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి... తగ్గేదేలే!

సైలంట్ అయిపోయారని అంటున్న సమయంలో... "తగ్గేదే లే" అంటూ సందడి చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

By:  Tupaki Desk   |   10 Nov 2024 9:16 AM GMT
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...  తగ్గేదేలే!
X

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం.. పలువురు కీలక నేతలు పార్టీని వీడటం.. మరికొంతమంది మౌనంగా ఉండటం.. ఇంకొంతమంది త్వరలో ఫ్యాన్ కింద నుంచి లేచి వెళ్లిపోతారనే కథనాలు వస్తుండటం.. మరోపక్క పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టులు.. ఇంకోపక్క ఇప్పటికే రిమాండుల్లో పలువూరు నేతలు... వెరసి వైసీపీ తీవ్ర కష్టాల్లో ఉందని అంటున్నారు.

ఈ సమయంలో గతంలో ప్రభుత్వంలో ఉండగా సందడి చేసి, చక్రాలు గట్రా తిప్పుతూ హల్ చల్ చేసిన నేతలు సైలంట్ అయిపోయిన పరిస్థితి! దీంతో... నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నాయకులు సైలంట్ అయిపోయారని.. ఎవరి పని వళ్లు చూసుకుంటూ రాజకీయాలకు కాస్త ఎడంగా ఉంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక నాయకుల బర్త్ డే సెలబ్రేషన్స్, కార్యకర్తలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు వంటి సందడులు కూడా కనిపించడం లేదని అంటున్నారు. ఇలా వైసీపీ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ మౌనం ఆవహించిందని.. సైలంట్ అయిపోయారని అంటున్న సమయంలో... "తగ్గేదే లే" అంటూ సందడి చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

చంద్రగిరి నియోజకవర్గాన్ని తన అడ్డా చేసుకుని రాజకీయాలు చేసిన చెవిరెడ్డి.. ఇటీవల ఎన్నికల్లో ఒంగోలుకు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. అయితే రెండు చోట్లా ఇద్దరూ ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా చెవిరెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. దీంతో.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేదు, నమ్ముకున్న నాయకుడు సీఎం హోదాలో లేరు, ఎమ్మెల్యే పదవీ లేదు, ఎంపీ సీటులో గెలుపూ లేదు.. అందువల్ల ఉన్నంతలో సైలంట్ గానే బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయని చాలా మంది భావించారంట. కానీ.. చెవిరెడ్డి తగ్గలేదని అంటున్నారు.

అవును... శనివారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో చెవిరెడ్డి బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేశారు. అది కూడా ఊహించనంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాతిక నుంచి 30 వేల మంది నాయకులు, లక్షల మంది కార్యకర్తలతో విందు వినోదాలతో, బాణసంచా శబ్ధాలతో బర్త్ డే సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో జరిగాయి!

ఈ వేడుకల్లో పాల్గొనడానికి చంద్రగిరి నియోజకవర్గంతో పాటు చిత్తురు, తిరుపతి జిల్లాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ వేడుకలకు హాజరయ్యారు. పైగా ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే మెజారిటీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఆ పార్టీలో ఉంటున్నారని.. పక్క పార్టీల నేతలతో కనీసం మాట్లాడంటంలేదనే చర్చలు జరుగుతున్నాయి!

అయితే... చెవిరెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదని తెలుస్తోంది. ఆయన బర్త్ డే కార్యక్రమానికి పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా హాజరయ్యారని తెలుస్తోంది. పక్క పార్టీలకు చెందిన నేతలు కూడా క్యూ కట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా... సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్ లు పార్టీలకు అతీతంగా చెవిరెడ్డికి శుభాకాక్షలు చెప్పారని చెబుతున్నారు.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయిన కీలక పాయింట్ ఏమిటంటే... టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి నాని సతీమణి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారని అంటున్నారు. దీంతో.. చెవిరెడ్డా మజా అంటూ కామెంట్లు పెడుతున్నారు వైసీపీ జనాలు!