తాజ్ చూసేందుకు వచ్చిన టూరిస్టుపై రాడ్లతో దాడి
కారు తాకిన వ్యక్తితో పాటు అతడి స్నేహితులు కొందరు ఇనుప రాడ్లు తీసుకొని దాడి చేశారు.
By: Tupaki Desk | 19 July 2023 5:33 AM GMTతప్పు జరిగిందని చెప్పినా వినకుండా వెంటబడి ఇనుపరాడ్లతో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహాల్ ను చూసేందుకు నిత్యం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది వస్తుంటారు. ఇందులో దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున ఉండటం తెలిసిందే. తాజాగా ఢిల్లీ నుంచి ఒక పర్యాటకుడు ఆగ్రా లోని తాజ్ మహాల్ ను చూసేందుకు వచ్చాడు.
సదరు టూరిస్టు బసాయ్ చౌకి - తాజ్ గంజ్ మార్గం లో కారు లో వెళుతున్నాడు. ఈ సమయం లో పొరపాటున టూరిస్టు కారు.. రోడ్డు పక్కన వెళుతున్న ఒకరిని తాకింది. వెంటనే.. కారు ఆపిన సదరు పర్యాటకుడు అతడికి సారీ చెప్పాడు. అనంతరం కారు లో వెళ్లాడు. అయినప్పటికీ.. సదరు పర్యాటకుడి ని దారుణంగా తిట్టటంతో పాటు.. అతడి సంబంధీకులు పలువురు ఆ కారు ను వెంబడించారు.
సదరు పర్యాటకుడు మిఠాయి దుకాణం లో ఉన్న వేళలో.. కారు తాకిన వ్యక్తితో పాటు అతడి స్నేహితులు కొందరు ఇనుప రాడ్లు తీసుకొని దాడి చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒకటి వైరల్ గా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతంలో పర్యాటకుల మీద ఈ విధమైన దాడులు జరిగితే..తాజ్ ఇమేజ్ కు దెబ్బ ఖాయమంటున్నారు. మరోవైపు.. ఈ ఉదంతం పై స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన ఐదుగురు యువకుల ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. టూరిస్టు పై దాడి ఉదంతాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని కోరుకుంటున్నారు.