Begin typing your search above and press return to search.

ప్రేమించాడంతే.. నగ్నంగా చేసి దారుణంగా చంపేశారు!

ఆ కుర్రాడు ప్రేమించాడంతే. అంతే.. కక్ష కట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు అతడ్ని ఎంత అమానవీయంగా చంపేశారంటే..

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:23 AM GMT
ప్రేమించాడంతే.. నగ్నంగా చేసి దారుణంగా చంపేశారు!
X

అవును.. ఆ కుర్రాడు ప్రేమించాడంతే. అంతే.. కక్ష కట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు అతడ్ని ఎంత అమానవీయంగా చంపేశారంటే.. విన్నంతనే గగుర్పాటుకు గురయ్యేలా ఉంది. తమకు సంబంధం లేని సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు తమ అమ్మాయిని ప్రేమించాడన్న కసితో అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసిన షాకింగ్ ఉదంతం హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.

ఘట్ కేసర్ సమీపంలోని అన్నోజిగూడకు చెందిన 18 ఏళ్ల కరణ్ నాయక్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తండ్రి మరణించగా.. తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అదే కాలనీలో ఉండే పదిహేనేళ్ల బాలికతో అతనికి ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు కావటంతో.. బాలిక తల్లిదండ్రులు అతడ్ని పలుమార్లు మందలించారు. అతను మాత్రం ఆ బాలికను పదే పదే కలుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదన్న కోపాన్ని కక్షగా మార్చుకొని అతడ్ని చంపేశారు.

తాజాగా బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఒక ఫంక్షన్ జరిగితే వెళ్లారు. అప్పుడు బాలిక ఇంట్లోనే ఉంది. అర్థరాత్రి వేళ.. బాలిక ఇంటికి వెళ్లాడు కరణ్. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఫంక్షన్ నుంచి వెంటనే వచ్చేసి.. కరణ్ తప్పించుకోకుండా బయట నుంచి గడియ పెట్టేశారు. స్థానికంగా మరొకరిని పిలిచి.. ఇంట్లోకి వెళ్లారు. కరణ్ ను ఇష్టారాజ్యంగా కొట్టేసి.. నగ్నంగా మార్చి తాళ్లతో కట్టేశారు. అతడి మర్మాంగాలపై కారం చల్లి.. కర్రలతో కొడుతూ చిత్ర హింసలకు గురి చేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న కుర్రాడు కాసేపటికి మరణించాడు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటంతో పాటు.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.