అడ్డం వస్తున్నాడని లవ్వర్ తో కలిసి భర్తను ఏసేసింది!
చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండల పరిధిలోని గజసింగరాజపురానికి చెందిన 34 ఏళ్ల ఆంటోని.. 30 ఏల్ల సుగంద్రి ఇద్దరు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు ఉన్నారు.
By: Tupaki Desk | 26 Jan 2025 4:33 AM GMTబంధాలు.. అనుబంధాలు ఉత్త మాయ అన్న భావనకు గురి చేసే ఉదంతాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. తాజాగా వెలుగు చూసిన దారుణం ఆ కోవకు చెందిందే. తాము నడిపే అపవిత్ర బంధాల కోసం భర్తల్ని ఏసేసే భార్యామణుల ఉదంతాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోవటం తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో ఈ తరహా దారుణం వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండల పరిధిలోని గజసింగరాజపురానికి చెందిన 34 ఏళ్ల ఆంటోని.. 30 ఏల్ల సుగంద్రి ఇద్దరు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు ఉన్నారు. సుగంద్రి స్వగ్రామం ఇరుగవాయి. ఆమెకు కొన్నేళ్లుగా తమ ఊరికి చెందిన 35 ఏళ్ల అరుళ్ రాజ్ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆ అంశంపై గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో.. వారింట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ విషయాన్ని ఆమె ప్రియుడితో మాట్లాడేది. చివరకు తమ బంధానికి అడ్డుగా వస్తున్న ఆంటోనిని ఏసేసే ప్లాన్ రచించారు. శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా భర్త నిద్ర పోతున్న వేళలో.. అతడి మెడకు తాడును బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలీదన్నట్లుగా అదే ఇంట్లో నిద్ర పోయింది. పొద్దున్నే తన భర్త మద్యం తాగి వచ్చి ఇంటి బయట పడుకొని చనిపోయినట్లుగా శోకాలు పెడుతూ చెప్పుకొచ్చింది.
ఆమె తీరుపై అనుమానం ఉన్న బంధువులు.. ఆమెను ప్రశ్నలు వేయటం.. అందుకు పొంతన లేని సమాధానాలు ఇస్తున్న క్రమంలో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెను కొన్ని ప్రశ్నలు వేయటం.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమెను పట్టుబడేలా చేశాయి. చివరకు పోలీసులు తమదైన విచారణకు ఆమె అసలు నిజాన్ని చెప్పేసింది.
తాను.. తన ప్రియుడు కలిసి భర్తను చంపేసినట్లుగా ఒప్పుకొంది. దీంతో.. ఆమెను.. ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు పనుల కోసం వారు చేసిన దారుణానికి ఒక నిండు ప్రాణం బలి కాగా.. ఈ బలుపు చేష్టలకు ఏ మాత్రం సంబంధం లేని ముగ్గురు చిన్నారులు ఇప్పుడు బాధితులుగా మారే దుస్థితి.