Begin typing your search above and press return to search.

ఈ సీఐ ఎంత నీచుడంటే.. పోక్సో కేసు కూడా సరిపోదు

అతడో పోలీసు అధికారి. సీఐగా గౌరవనీయ స్థానంలో పని చేస్తున్న అతగాడి కామోన్మోదం గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

By:  Tupaki Desk   |   23 March 2024 4:56 AM GMT
ఈ సీఐ ఎంత నీచుడంటే.. పోక్సో కేసు కూడా సరిపోదు
X

అతడో పోలీసు అధికారి. సీఐగా గౌరవనీయ స్థానంలో పని చేస్తున్న అతగాడి కామోన్మోదం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ప్రజలకు రక్షణ కల్పించే గౌరవనీయ ఉద్యోగంలో ఉన్న అతగాడు సభ్య సమాజం తలదించుకునే దారుణానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. తాజాగా అతడిపై అత్యాచార కేసుతో పాటు పోక్సోకేసును నమోదు చేసినప్పటికి అతడు చేసిన పనికి ఆ కేసులు చిన్నవే అన్న మాట వినిపిస్తోంది. అసలేం జరిగిందంటే..

ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ సీఐగా పని చేస్తున్నాడు బండారి సంపత్. 2022లో కాకతీయ వర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేవాడు. ఆ టైంలో హనుమకొండలోని ఒక కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. అది సన్నిహిత సంబంధంగా మారింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయ్యాడు. అయినప్పటికీ ఆమెతో స్నేహాన్ని కంటిన్యూ చేశాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల అతను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ సీఐగా ట్రాన్సఫర్ అయి వచ్చాడు. ఈ క్రమంలో అతడిలో తప్పుడు ఆలోచనలు కలిగాయి. సదరు మహిళకు ఉన్న పదహారేళ్ల కుమార్తె మీద ఇతగాడి కన్ను పడింది. అదును చూసి ఆమెను అత్యాచారం చేశాడు. ఇతడి దుర్మార్గాన్ని ఆ బాలిక తల్లికి చెప్పటంతో ఆమె కేయూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

దీంతో స్పందించిన పోలీసులు వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి విచారించారు. అనంతరం సీఐ సంపత్ మీద అత్యాచారంతో పాటు పోక్సో కేసును నమోదు చేశారు. ఇతడి దుర్మార్గం ముందు ఆ కేసులు సైతం చిన్నవే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.