కానిస్టేబుల్ హత్య కేసులో వెలుగులోకి మరిన్ని సంచలనాలు!
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ముందు శివజ్యోతి అలియాస్ శివానీ పెద్ద కుట్రే పన్నింది
By: Tupaki Desk | 7 Aug 2023 6:33 AM GMTవిశాఖ వన్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంంధించిన దర్యాప్తు సాగుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో భాగంగా కానిస్టేబుల్ రమేష్ హత్యకేసులో పోలీసులకు కీలక వీడియోలు లభ్యమయ్యాయి. ఇందులో రమేష్ భార్య తెలివితేటలు చూసి షాకయ్యారని తెలుస్తోంది.
అవును... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ముందు శివజ్యోతి అలియాస్ శివానీ పెద్ద కుట్రే పన్నింది. ఈ సందర్భంగా ఆమె తెలివి తేటలకు పోలీసులు షాకయ్యారంట. రమేష్ ను హత్య చేసే ముందు ఎవరికీ అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు వీడియోలు రికార్డు చేసింది. భర్తకు మటన్ కూడా వండిపెట్టి, మద్యం తాగించి.. నా భార్య మంచిదని వీడియోలో చెప్పించింది.
అనంతరం భర్త రమేష్ మద్యం మత్తులో పడిపోతుంటే.. మంచంపై పడుకోబెట్టిన వీడియోలు సైతం రికార్డు చేసింది. తన భర్తను తాను అంత ప్రేమగా చూసుకుంటాను అని ఆ వీడియోల ద్వారా చెప్పాలనుకుంది. ఆ తర్వాత నిద్రపోతుండగా దిండుతో ఊపిరాడకుండా చేయించి హతమార్చింది. అనంతరం ఆ చావుని గుండెపోటుగా చిత్రీకరించింది.
అయితే తాజాగా ఆమె సెల్ ఫోన్ లోని వీడియోలు, చాటింగులను పోలీసులు పరిశీలించారని తెలుస్తుంది. ఈ సమయంలో ఆమె ఫెర్ఫార్మెన్స్ కు సంబంధించిన పలు వీడియోలు దర్శనమిచ్చాయని తెలుస్తోంది. ఆ వీడియోలు అన్నింటిలోనూ తనకూ తన భర్తకూ మధ్య తీవ్రమైన అన్యోన్యత ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసిందంట.
అయితే... రమేశ్ చనిపోయిన తర్వాత తనపై ఎవరికీ అనుమానం రాకుండా ముందుగానే వీడియోలు తీసిపెట్టుకున్నట్టు శివానీ పోలీసుల ఎదుట అంగీకరించిందట. దీంతో ఆమె తెలివితేటలు చూసి ఖాకీలు కంగుతున్నారని తెలుస్తోంది.
కాగా... విశాఖ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్ కుమార్ (40) ను అతని భర్య శివజ్యోతి తన ప్రియుడు రామారావుతో కలిసి హత్య చేయించిన సంగతి తెలిసిందే! ఈ హత్య కేసులో ఎ1గా శివజ్యోతి, ఎ2గా రామారావు, ఎ3గా హత్యకు సుపారీ తీసుకున్న నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.