Begin typing your search above and press return to search.

క్లోజ్ ఫ్రెండ్ భార్యతో కార్పోరేటర్... కీలక నిర్ణయం తీసుకున్న ఆమె భర్త!

స్నేహితుడు కార్పొరేటర్ అయ్యి ఇంటికి వచ్చాడని అతడు పొంగిపోయాడు. ఈ గ్యాప్ లో అతని భార్యతో కార్పొరేటర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 3:13 PM GMT
క్లోజ్  ఫ్రెండ్  భార్యతో కార్పోరేటర్... కీలక నిర్ణయం తీసుకున్న ఆమె భర్త!
X

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల వార్తలు నిత్యం హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వరసలు, బంధాలు, వయసులు ఇవేవీ అక్రమసంబంధాలకు అడ్డు కావడం లేదు. ఈ సమయంలో తాజాగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఒక తప్పుడు పనికి పాల్పడ్డాడు. ఫలితం దారుణానికి దారి తీసింది.

అవును... కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు ఒక వ్యక్తి. ఈ సమయంలో ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవాలని.. ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టాడు. అలా అని ఇతనేదో గొప్పపనికే పూనుకున్నాడని అనుకుంటే పొరపాటే... ఈ క్రమంలో ఒకరోజు తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు!

ఈ క్రమంలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. స్నేహితుడు కార్పొరేటర్ అయ్యి ఇంటికి వచ్చాడని అతడు పొంగిపోయాడు. ఈ గ్యాప్ లో అతని భార్యతో కార్పొరేటర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రోజూ కలవడం మొదలుపెట్టాడు. ఆ విషయం ఒకరోజు స్నేహితుడి కంటపడింది. అనంతరం దరుణం జరిగిపోయింది.

వివరాళ్లోకి వెళ్తే... బళ్లారి మహానగర కార్పొరేషన్ సభ్యుడు తన స్నేహితుడి ఇంటికి రెగ్యులర్ గా వెల్లడం మొదలుపెట్టాడు. దీంతో స్నేహితుడే కదా అని సదరు వ్యక్తి.. కాస్త స్వేచ్చ ఇచ్చాడు. ఈ క్రమంలో అతను స్నేహితుడి భార్య మీద కన్ను వేశాడు కార్పొరేట్.

ఈ సమయంలో భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న కార్పోరేటర్ వ్యవహారం కంటపడటంతో... భర్త, స్నేహితుడిని నిలదీశాడు. దీంతో కార్పొరేటర్ అతడిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భరించలేకపోయిన ఆ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

బళ్లారి సిటీలోని 30వ వార్డులో ఈ వ్యవహారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... సదరు కార్పొరేటర్ పై ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా... కేసు విచారణ చేస్తున్నామని బళ్లారి పోలీసు ఎస్పీ రంజిత్ కుమార్ బండారు మీడియాకు తెలిపారు!