బీటెక్ డ్రాపౌట్ హైదరాబాదీ.. నకిలీ క్యాసినో నడుపుతున్నాడు!
అవును... నకిలీ క్యాసినో వెబ్ సైట్ రన్ చేస్తున్నాడనే ఆరోపణలతో 22ఏళ్ల హైదరాబాదీని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 16 May 2024 10:27 AM GMTడైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే... హైదరాబాద్ కు చెందిన ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డ్రాపౌట్ వ్యక్తి.. వయసు 22 ఏళ్లు.. చాట్ జీపీటీ ఉపయోగించి నకిలీ క్యాసినో వెబ్ సైట్ రన్ చేస్తున్నాడనేది ఆరోపణ. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని హైదరాబాద్ లోని రాఘవేంద్రనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారని తెలుస్తుంది.
అవును... నకిలీ క్యాసినో వెబ్ సైట్ రన్ చేస్తున్నాడనే ఆరోపణలతో 22ఏళ్ల హైదరాబాదీని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దక్షిణ గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడని, ఇంటర్నెట్ లో తరచూ లొకేషన్ లు మారుస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు సూపరింటెండెంట్ (సైబర్ క్రైమ్) రాహుల్ గుప్తా వెల్లడించారు.
ఇందులో భాగంగా... నిందితుడు మూడు వేర్వేరు డొమైన్ లను ఉపయోగించి వెబ్ సైట్ లను డెవలప్ చేశాడని.. అమాయక ఆన్ లైన్ వినియోగదారులను ఆకర్షించడానికి నకిలీ ఆన్ లైన్ గేమింగ్ సైట్ కోసం ఒక కంపెనీ లోగో, బ్రాండ్ పేరు, షిప్ ఫోటోలు, లోపల క్యాసినో ఫోటోలను ఉపయోగించాడని తెలిపారు.
అయితే ఈ వ్యవహారంపై సమాచారం అందిన అనంతరం చేపట్టిన విచారణలో... నిందితుడు భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో ఉన్నట్లు కనుగొనబడిందని అన్నారు. ఈ సమయంలో డేటాను మరింత విశ్లేషించినప్పుడు అనుమానితులలో ఒకరు హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు తేలిందని.. దాని ప్రకారం ఒక బృందం హైదరాబాద్ కు వెళ్లిందని వెల్లడించారు.
ఈ సమయంలో తదుపరి విచారణలో నిందితుడు దక్షిణ గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ఇక నిందితుడు హైదరాబాద్ లోని విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చదువుతూ డ్రాపౌట్ అయ్యాడని వెల్లడించారు. ప్రస్తుతం కేసు తదుపరి దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు!