విజయవాడ సైకో ప్రేమికుడు.. ప్రైవేట్ స్కూల్లో 'టీచర్'
తన ప్రేయసి ఎదుటే.. ఆమె తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఈ సైకో బ్యాక్ గ్రౌండ్ గురించిన వివరాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.
By: Tupaki Desk | 29 Jun 2024 4:12 AM GMTతమ ప్రేమను కాదన్నాడని.. పెళ్లికి నో చెప్పటమే కాదు.. తన సంబంధీకుల్ని ఇంటికి తీసుకొచ్చి తన తల్లితో తన గురించి చెప్పి.. తాను ప్రేమించిన అమ్మాయిని తనకు కాకుండా చేస్తున్నాడన్న కసితో.. ఉన్మాదంతో సైకోగా వ్యవహరించిన బెజవాడ మణికంఠ దురాగతం గురించి తెలిసిందే. తన ప్రేయసి ఎదుటే.. ఆమె తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఈ సైకో బ్యాక్ గ్రౌండ్ గురించిన వివరాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.
తమ ప్రేమను కాదన్న అమ్మాయి తండ్రిని నడి రోడ్డు మీద మాంసం నరికే కత్తితో దాడి చేసి హత్య చేసిన గడ్డం శివ మణికంఠ బీపీటీ చదివి.. భవానీపురంలోని ఒక ప్రైవేటు స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వైనం వెలుగు చూసింది. హత్య చేసి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడ్ని క్రిష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన అతడిని రిమాండ్ కు పంపనున్నారు.
ఇదిలా ఉండగా బాధిత కుటుంబం ఈ షాక్ నుంచి కోలుకోలేదు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తన కారణంగా తన తండ్రిని తన కళ్ల ముందే హత్య చేసిన వైనంపై దర్శిని తీవ్రమైన షాక్ లో ఉంది. ఎంతగా ప్రాధేయపడినా.. పట్టించుకోకుండా తన తండ్రిని కత్తితో దారుణంగా నరికి చంపిన అతడ్ని పోలీసులు ఉరికే వదిలిపెట్టకూడదని కోరుతోంది. తనకు ఇష్టం లేదని చెబుతున్నప్పటికీ తన వెంటపడి వేధించేవాడని దర్శిని ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో అతడితో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగేవాడని.. తన తల్లిదండ్రుల్ని అసభ్యంగా దూషించేవాడని చెప్పింది. ఇప్పుడు ఏకంగా తన తండ్రిని పొట్టన పెట్టుకున్నాడంటూ కన్నీటిపర్యంతమైంది. మణికంఠను కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ హత్య ఉదంతంవిజయవాడలో సంచలనంగా మారింది. ఇలాంటి సైకో లవ్వర్ల పట్ల కనికరం చూపకూడదని.. కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందంటున్నారు.