Begin typing your search above and press return to search.

మలయాళీ క్రైం థ్రిల్లర్స్ ని మించిన క్రైం స్టోరీ @ ఖమ్మం!

ప్రతీ నేరస్తుడు తాను మాత్రమే తెలివైన వాడిని, తనను ఎవరూ పట్టుకోలేరు, తాను చాలా బాగా ప్లాన్ చేశాను అని అనుకంటాడంట.

By:  Tupaki Desk   |   16 July 2024 7:08 AM GMT
మలయాళీ క్రైం థ్రిల్లర్స్  ని మించిన  క్రైం స్టోరీ @ ఖమ్మం!
X

ప్రతీ నేరస్తుడు తాను మాత్రమే తెలివైన వాడిని, తనను ఎవరూ పట్టుకోలేరు, తాను చాలా బాగా ప్లాన్ చేశాను అని అనుకంటాడంట. ఇదే క్రమంలో... ఓ క్లూని కూడా తనకు తెలియకుండానే వదిలేస్తాడట. చాలా మంది క్రైం ఇన్ వెస్టిగేషన్ అధికారులు ఇలా చెబుతారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఖమ్మంలో ఓ వ్యక్తి ఇలానే ఆలోచించాడు.. కానీ... దొరికేశాడు!

అవును... ఇటీవల కాలంలో మనిషి ప్రాణం తీయడం అనేది సాటి మనిషికి చాలా సులువైపోయినట్లుగా మారిపోయింది సమాజం అనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నేరాలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నవారు.. పీకలలోతు పగలు ఉన్నవారూ హత్యలకు పాల్పడ్డారంటే అది వేరే సంగతి!!

అలా కాకుండా సభ్యసమాజంలో ఉత్తమ పురుషుల్లా మెలుగుతున్న వారు.. ఇలా తెరవెనుక చేస్తున్న అరాచకాలు షాకింగ్ గా ఉంటున్నాయి. అలా సమాజంలో వైద్య వృత్తిలో ఉన్న ఓ ఉత్తముడిగా నటిస్తూ.. తెరవెనుక మాత్రం కుట్ర దాచుకుని.. ప్రియురాలి కోసం భార్యా, పిల్లలను సినిమాటిక్ గా ప్లాన్ చేసిన చంపిన ఓ వ్యక్తి కథే ఈ ఖమ్మం క్రైం స్టోరీ!

వివరాళ్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఫిజియోతెరపిస్టుగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో తనతో పనిచేస్తున్న ఓ అమ్మాయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . ఈ మైకంలో భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు.

అయితే పూర్తిగా అక్రమ సంబంధంలోనే మునిగి తేలాలని, లైఫ్ ఆమెతోనే కంటిన్యూ చేయాలని భావించిన అతడు... అందుకు భార్య, పిల్లలు అడ్డు అని భావించి, వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ సమయంలో పోస్టుమార్టంలో దొరక కూడదంటే ఎంత మోతాతులో పాయిజన్ డోస్ ఇవ్వాలో గూగుల్ చేసి తెలుసుకున్నాడు.

ఈ క్రమంలో ఓ రోజు కారులో గ్రామానికి వెళ్తుండగా... తన భార్యకు కారులో ఆ ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఇదే సమయంలో నాలుగు సంవత్సరాల లోపు వయసున్న ఇద్దరు ఆడపిల్లల గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కారును చెట్టుకు గుద్దించిన అతడు... వాళ్లు ముగ్గురూ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించాడు.

అయితే... చనిపోయిన భార్యా, పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో కారులో ఇంజక్షన్, ప్రవీణ్ మొబైల్ లోని గూగుల్ హిస్టరీలో అతడి క్రియేటివిటీ బయటపడింది. ఇక చేసేదేమీలేక నేరాన్ని ఒప్పుకున్నాడు ప్రవీణ్. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.