Begin typing your search above and press return to search.

ఇన్‌ స్టాలో పరిచయం... ప్రియుడితో కలిసి భర్త హత్య!

కొంతమంది రకరకాల కారణాలతో అడ్డదారులు తొక్కుతున్న వార్తలు నిత్యం ఏదో ఒక మూల దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Aug 2023 9:09 AM GMT
ఇన్‌ స్టాలో పరిచయం... ప్రియుడితో కలిసి భర్త హత్య!
X

పెళ్లై, పిల్లలు ఉన్నా.. కొంతమంది రకరకాల కారణాలతో అడ్డదారులు తొక్కుతున్న వార్తలు నిత్యం ఏదో ఒక మూల దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖలో ప్రియుడిపై మోజుతో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన భర్తను చంపించింది ఓ మహిళ. ఇదే తరహాలో తాజాగా ఏలూరు జిల్లాలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

ఈమధ్యకాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు, ఘోరాల సంగతి తెలియంది కాదు! అత్యంత ఘోరమైన సంఘటనలు, అత్యంత పాశవికమైన విషయాలు ఈ వివాహేతర సంబంధాల వల్ల తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసింది భార్య!

వివరాళ్లోకి వెళ్తే... తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఒకవ్యక్తి (39) అదే ప్రాంతానికి చెందిన మహిళను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నారాయణపురంలోని పరిశ్రమలో పనిచేస్తున్న ఆ వ్యక్తి.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో నివాసం ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి హత్య గావింపబడ్డాడు. తన భర్తను హత్య చేశారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి మెడమీద పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచినట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిసాయి.

మృతుడు భార్యకి తాడేపల్లిగూడెంకు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి తన భర్తను ఆమె హతమార్చినట్టు తేల్చారు. అయితే, ఈమెకు ఆ వ్యక్తి ఇన్‌ స్టాగ్రామ్‌ లో పరిచయం అయ్యాడట. ఈ సమయంలో తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది.

ఈ సమయంలో విగతజీవిగా తండ్రి పడి ఉండటం.. తల్లిని పోలీసులు తీసుకెళ్లడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న వీరి పిల్లల అమాయక చూపులు స్థానికులను కలచివేస్తున్నాయి!