అందంగా ఉందని.. గర్వంగా ఫీలవుతోందని గర్ల్ ఫ్రెండ్ ను చంపేశాడు
ఈ ఘటన జరిగిన గంట తరువాత హంతకుడు బాధితురాలి స్నేహితురాలికి ఫోన్ చేసి "మీ ఫ్రెండ్ అందంగా ఉందని గర్వంగా ఫీలవుతోంది. అందుకే ఆమెను చంపేశాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
By: Tupaki Desk | 13 March 2025 3:00 AM ISTఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన దారుణ ఘటనలో తన గర్ల్‌ఫ్రెండ్ అత్యంత అందంగా ఉందని గర్వంగా ఫీలవుతోందని భావించిన ఓ యువకుడు అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. శివం వర్మ అనే యువకుడు తన ప్రియురాలు నమ్మకంగా వ్యవహరించడం లేదన్న అనుమానంతో ఆమెను తన గదికి పిలిపించుకుని గొంతుకోసి హత్య చేశాడు. బాధిత యువతి, ఆమె స్నేహితురాలు సోమవారం మధ్యాహ్నం మార్కెట్‌కి వెళ్లిన సమయంలో శివం అక్కడికి చేరుకొని తన గదికి రావాలని కోరాడు. యువతి అతనితో వెళ్లగా, ఆమె స్నేహితురాలు ఇంటికి వెళ్లిపోయింది.
- హత్య తర్వాత స్నేహితురాలికి ఫోన్ కాల్
ఈ ఘటన జరిగిన గంట తరువాత హంతకుడు బాధితురాలి స్నేహితురాలికి ఫోన్ చేసి "మీ ఫ్రెండ్ అందంగా ఉందని గర్వంగా ఫీలవుతోంది. అందుకే ఆమెను చంపేశాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురైన స్నేహితురాలు మృతురాలి తండ్రికి విషయం చెప్పింది.
-ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి…హృదయ విదారక దృశ్యం
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి తన కుమార్తె రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉండడం చూసి కుప్పకూలిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ ఆందోళన చేపట్టారు.
నిందితుడి అరెస్ట్… పోలీసుల హామీతో ఆందోళన విరమణ
దాదాపు రెండు గంటలపాటు హైడ్రామా కొనసాగగా, పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
-గతంలోనే అనుమానాస్పద ప్రవర్తన
మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శివం వర్మ గతంలో తమ ఇంటి పక్కనే వేరే గదిలో అద్దెకు ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన అనుచితంగా ఉండడంతో యజమాని అతడిని ఇంటి నుంచి పంపించేశాడు. శివం తరచూ యువతులను తన గదికి తీసుకువచ్చేవాడని, ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని అతన్ని గదిని ఖాళీ చేయించాలని చెప్పారని తెలిపారు.
- మృతురాలి తండ్రి విజ్ఞప్తి
తన కుమార్తె హత్యకు న్యాయం చేయాలని, నిందితుడికి గరిష్ఠ శిక్ష విధించాలని మృతురాలి తండ్రి పోలీసులను కోరారు. ప్రస్తుతం పోలీసులు శివం వర్మపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.