లవ్వర్ తో ఏకాంతంలో ఉన్నప్పుడు చూశారని చెల్లెళ్లను చంపేసింది
ఎవరో తన చెల్లెళ్లను చంపేశారంటూ కట్టుకథ చెప్పింది. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడున్నపరిస్థితుల్ని చూసి.. ఆధారాల్ని సేకరించారు
By: Tupaki Desk | 11 Oct 2023 4:12 AM GMTదారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాము చేసే తప్పుడు పనుల్ని కప్పిపుచ్చి ఉంచటానికి వీలుగా.. ప్రాణాలు తీయటానికి సైతం వెనుకాడని దుర్మార్గం చోటు చేసుకుంది. తోడ బుట్టిన చెల్లెళ్లను హతమార్చేందుకు సైతం వెనుకాడలేదు. యూపీలోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన ప్రియుడితో ఏకాంతంలో ఉన్న సమయంలో తన చెల్లెళ్లు చూశారన్న కారణంగా.. వారిని పాశవికంగా చంపేసిన దారుణం వెలుగు చూసింది.
బహదూర్ పుర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల అంజలికి ఇద్దరు చెల్లెళ్లు. వారి వయసు ఆరేళ్లు.. నాలుగేళ్లు. తాజాగా ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయాన్ని చూసిన అంజలి.. తన ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. వీరిద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమె ఇద్దరు చెల్లెళ్లు వీరిని చూశారు. ప్రియుడితో కలిసి ఉన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతారని భావించిన ఆమె.. వారిద్దరిని పదునైన ఆయుధంతో హత్య చేసింది.
ఎవరో తన చెల్లెళ్లను చంపేశారంటూ కట్టుకథ చెప్పింది. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడున్నపరిస్థితుల్ని చూసి.. ఆధారాల్ని సేకరించారు. ఈ సందర్భంగా రక్తం మరకలు అంటిన అంజలి దుస్తుల్ని సైతం పోలీసులు గుర్తించారు. ఆమెను తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. తన ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు.. ఇద్దరు చెల్లెళ్లు చూశారని.. ఆ విషయాన్నితల్లిదండ్రులకు చెబుతారన్న ఉద్దేశంతో వారిని చంపేసింది. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. చెల్లెళ్లను చంపేందుకు అంజలికి సాయం చేసిన వారెవరు? అన్న విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.