Begin typing your search above and press return to search.

మోడల్‌ దివ్య పోస్ట్‌ మార్టం... తెరపైకి సంచలన విషయాలు!

హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:25 AM GMT
మోడల్‌  దివ్య పోస్ట్‌  మార్టం... తెరపైకి సంచలన విషయాలు!
X

ఈమధ్యకాలంలో మాజీ మోడల్ దివ్య పాహుజా హత్య విషయం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌ స్టర్‌ సందీప్‌ గడోలీ నకిలీ ఎన్‌ కౌంటర్‌ కేసులో నిందితురాలైన దివ్యను జనవరి 2న గురుగ్రాంలోని హోటల్‌ లో కాల్చి చంపారు. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

అవును... గురుగ్రాంలోని హోటల్‌ లో హత్యకు గురైన మోడల్‌ దివ్వ పాహుజా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెరపైకి వచ్చింది. హోటల్ లో హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు సీసి కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మృతదేహాన్ని హరియాణాలోని కాలువలో కనుగొన్నారు. అనంతరం హిస్సార్‌ లోని మెడికల్‌ కళాశాలలో పోస్ట్‌ మార్టం నిర్వహించారు.

వాస్తవానికి తొలుత ఆమె తల భాగానికి ఎక్స్‌ రే తీయగా.. తలలో తూటా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదలైంది. ఇందులో భాగంగా... ఆమెను నిందితులు పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చినట్లు గుర్తించారని తెలుస్తుంది. ఆమెను కంటి వద్ద కాల్చినట్లు అధికారులు తేల్చారు. ఇదే సమయంలో ఇతర శరీర భాగాలపై కూడా గాయాల ఆనవాళ్లు కనిపించాయి.

ఈ నేపథ్యంలో మృతదేహం నుంచి సేకరించిన భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేరానికి సంబంధించిన హోటల్‌ యజమాని అభిజీత్‌ సింగ్‌ తో పాటు ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో... హత్య జరిగిన తర్వాత దివ్య శవాన్ని నిందితులు పంజాబ్‌ లోని భాఖ్‌ డా కాలువలో పడేయగా.. అది హరియాణాకు కొట్టుకొచ్చినట్లు తెలిపారు.

ఈ సమయంలో... హరియాణా గ్యాంగ్‌ స్టర్‌ సందీప్‌ గడోలీతో మాజీ మోడల్ దివ్యకు సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. 2016లో ముంబయిలో జరిగిన ఓ ఎన్‌ కౌంటర్‌ లో సందీప్‌ మరణించగా.. అది ఫేక్ ఎన్‌ కౌంటర్‌ అని తేలిందని అంటున్నారు! ఇందులో భాగంగా.. సందీప్‌ ప్రత్యర్థి అయిన బిందర్‌ గుజ్జర్‌ అనే గ్యాంగ్‌ స్టర్‌.. హరియాణా పోలీసులతో కుమ్మక్కై చేయించాడని చెబుతున్నారు!

అయితే ఈ సమయంలో బిందర్‌ గుజ్జర్ కుట్రలో భాగంగానే సందీప్‌ ను దివ్య అక్కడికి తీసుకొచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమె ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించింది. ఈ క్రమంలో ఆమె ఇటీవల హోటల్ లో కాల్చి చంపబడింది! దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమెను పాయింట్ బ్లాంక్ లో కాల్చినట్లు చెబుతున్నారు!