సూట్ కేసులో శవంతో రైలు ప్రయాణం... ఏమిటీ తండ్రికూతురి వ్యవహారం?
అవును... ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి, రైలులో ప్రయాణిస్తు, ఓ చోట రైల్వే ఫ్లాట్ ఫాం పైకి విసిరేసిన తండీ కూతురు వ్యవహరం తాజాగా వెలుగులోకి వచ్చింది!
By: Tupaki Desk | 5 Nov 2024 5:37 AM GMTఇటీవల కాలంలో మనిషి ప్రాణం తీయడం అంటే చాలా మందికి చాలా సులువైన విషయంగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఓ తండ్రీకూతురు కలిసి సూట్ కేసులో శవాన్ని పెట్టుకుని రైలు ప్రయాణం చేస్తూ, మార్గమద్యలో ఆ సూట్ కేసుని ఫ్లాట్ ఫాం మీదకు విసిరేసిన ఘటన తెరపైకి వచ్చింది.
అవును... ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి, రైలులో ప్రయాణిస్తు, ఓ చోట రైల్వే ఫ్లాట్ ఫాం పైకి విసిరేసిన తండీ కూతురు వ్యవహరం తాజాగా వెలుగులోకి వచ్చింది! సినిమాలో సన్నివేశంలా ఉన్న ఈ ఘటన నెల్లురు టూ చెన్నై వయా మీంజూర్ స్టేషన్ అన్నట్లుగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... నెల్లుగురు నగరానికి చెందిన తండ్రీ కూతురు కలిసి.. నెల్లూరులో ఓ మహిళను హత్యచేసి, ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో బయలుదేరారంట. ఈ సమయంలో ఆ మహిళ శవాన్ని ఓ సూట్ కేసులో పెట్టి, ఆ సూట్ కేసు చేతపట్టి బయలుదేరారంట.
ఈ సమయంలో రైలు మీంజూర్ స్టేషన్ కు రాగానే.. స్టేషన్ ఫ్లాట్ ఫాం పైకి ఆ శవం ఉంచిన సూట్ కేసును పడేశారని చెబుతున్నారు. అలా వారు ఆ సూట్ కేసును పడేసి వెళ్లిపోయిన తర్వాత.. దాన్ని ఓ రైల్వే కానిస్టేబుల్ చూశారంట. ఆ సమయంలో ఆ సూట్ కేసునుంచి రక్తం రావడం గమనించి.. అనుమానం వచ్చి దాన్ని తెరిచి చూశారట.
దీంతో... ఆ సూట్ కేసులో ఓ మహిళ మృతదేహం కనిపించేసరికి.. పైఅధికారులకు సమాచారం అందించారట. దీంతో... ఈ విషయంపై ఆరాతీయగా... తండ్రీకుతురి వ్యవహరం బయటపడింద్ని అంటున్నారు. ప్రస్తుతం ఈ తండ్రి, కుమార్తెను అదుపులోకీ తీసుకున్న తమిళనాడు పోలీసులు.. విచారిస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!