ఉద్యోగం ఇప్పిస్తానని అత్యాచారం.. బీజేపీ చీఫ్ దురాచారం!
ఢిల్లీకి చెందిన ఓ యువతి(23) తన స్నేహితురాలితో కలిసి 2023, జూలైలో హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు.
By: Tupaki Desk | 15 Jan 2025 12:30 PM GMTదేశానికి నీతులు చెప్పే నాయకులు అవినీతి, అక్రమాల కేసుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా ఓ అత్యాచారం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కేసు నమోదైంది. ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా నని, నటిగా కూడా అవకాశం కల్పిస్తానని నమ్మ బలికి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే.. ఈ ఘటన జరిగిన 20 మాసాల తర్వాత.. బాధితురాలు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఆమె పై పలు మార్లు అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయన ఒక్కడే కాకుండా.. ఓ ప్రముఖ గాయకుడు కూడా పలు మార్లు అత్యాచారం చేసినట్టు గుర్తించారు.
ఏం జరిగింది?
ఢిల్లీకి చెందిన ఓ యువతి(23) తన స్నేహితురాలితో కలిసి 2023, జూలైలో హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఓ హోటల్ గదిలో ఉన్నవారిని హరియాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, ప్రముఖ సింగర్ రాకీ మిట్టల్ కలిశారు. నటిగా అవకాశం ఇస్తానని రాకీ, ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం ఇప్పిస్తానని బడోలీ చెప్పినట్టు బాధితురాలు తెలిపారు.
అనంతరం.. స్నేహితురాలిని బయటకు పంపించి.. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ.. సదరు యువతిపై సామూహికంగా అత్యాచారం చేశారు. అంతేకాదు.. పలుమార్లు తర్వాత కూడా.. కలిసి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఆరోపించారు. ఇక, ఈ క్రమంలో ఒకరు తర్వాత.. ఒకరు ఈ సన్నివేశాలను వీడియో కూడా చిత్రీకరించారని.. ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్టు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు తాజాగా ఆమెను వైద్య పరీక్షలకు పంపించి.. కేసు నమోదు చేశారు.
రాజకీయ ఆరోపణలు..
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. ఉద్దేశపూర్వకంగా తమ ప్రత్యర్థులు ఇలాంటి విషయాలు ఆరోపిస్తున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన యువతిపై అత్యాచారం జరిగినప్పుడు అప్పుడే ఎందుకు స్పందించలేద ని ప్రశ్నిస్తున్నారు. ఇది కావాలని చేస్తున్న యాగీగా పేర్కొన్నారు. దీనిపై తాము సమగ్ర విచారణ కోరుకుంటున్నామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.