Begin typing your search above and press return to search.

తిరుపతిలో షాకింగ్ క్రైం: కొత్త ప్రేమికుడ్ని పాత లవ్వర్ తో పొడిపించింది!

రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ క్రైం సీన్ మీద బోలెడన్ని సందేహాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Sep 2024 6:20 AM GMT
తిరుపతిలో షాకింగ్ క్రైం: కొత్త ప్రేమికుడ్ని పాత లవ్వర్ తో పొడిపించింది!
X

తిరుపతి పట్టణంలో చోటు చేసుకున్న ఒక పరిణామం షాకింగ్ గా మారింది. రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ క్రైం సీన్ మీద బోలెడన్ని సందేహాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ సదరు క్రైంకు కారణం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం మొత్తాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే.. కొత్త ప్రేమికుడ్ని పాత లవ్వర్ చేత కత్తితో పొడిపించిన ప్రేమికురాలి వ్యవహారం షాకింగ్ గా మారింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన లోకేశ్ తిరుపతిలో పారామెడికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తన క్లాస్ మేట్ తో ఇటీవల ప్రేమలో పడ్డాడు. శనివారం సినిమాకు వెళదామని లోకేశ్ కు చెప్పటంతో అతను ఓకే చెప్పాడు. సదరు గాళ్ ఫ్రెండే సినిమాకు టికెట్లను బుక్ చేసింది.

హాస్టల్ నుంచి లోకేశ్ బైక్ మీద థియేటర్ కు రాగా.. ఆమె ఆటోలో వచ్చింది. ఇద్దరు తమ సీట్లలో కూర్చొని సినిమా చూస్తున్నారు. కాసేపటికి వారి ముందు సీట్లో కూర్చున్న తిరుపతి జిల్లాకు చెందిన కార్తీక్ కత్తితో లోకేశ్ కడుపులో పొడిచాడు. అనంతరం అతను.. లోకేశ్ గాళ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి థియేటర్ నుంచి వెళ్లిపోగా.. షాక్ కు గురైన లోకేశ్ వాష్ రూంకు వెళ్లి తనకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసుకున్నాడు. కత్తిపోట్ల వ్యవహారాన్ని గుర్తించిన థియేటర్ సిబ్బంది సమాచారాన్ని పోలీసులకు అందించగా.. అతడ్ని రుయా ఆసుపత్రికి తరలించారు.

కట్ చేస్తే.. తాను కింద పడ్డానని అందుకే గాయమైనట్లుగాతొలుత లోకేశ్ పేర్కొన్నాడు. అయితే.. పోలీసులు విచారించగా అసలు విషయాలు వెలుగు చూశాయి. లోకేశ్ గాళ్ ఫ్రెండ్, కార్తీక్ లు ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారని.. ఇద్దరు బంధువులన్న విషయం బయటకు వచ్చింది. అయితే..కొంతకాలంగా తన క్లాస్ మేట్ లోకేశ్ తో చనువుగా ఉంటోంది. అయితే.. ఇద్దరి బాయ్ ఫ్రెండ్ సమాచారాన్ని ఆమె షేర్ చేసేది. దీంతో.. వీరిద్దరి మధ్య కక్షల వరకు సీన్ వెళ్లింది. కార్తీక్ పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు.

మధ్యలో ఏమైందో ఏమో కానీ.. లోకేశ్ మీద కోపం పెంచుకున్న కార్తీక్.. థియేటర్ లో దాడికి ప్లాన్ చేశాడు. తాను చెప్పినట్లుగా చేయాలన్న ఒత్తిడితో.. ముగ్గురికి థియేటర్ లో మూవీకి ప్లాన్ చేశారు. మందుగాబుక్ చేసినట్లే.. వెనుక సీట్లో లోకేశ్.. అతని గాళ్ ఫ్రెండ్ కూర్చుంటే.. ముందు సీట్లో కార్తీక్ కూర్చున్నాడు. సినిమా మొదలైన కాసేపటికే.. తనతో తెచ్చుకున్న కత్తితో లోకేశ్ మీద దాడి చేశాడు. అతడి పొత్తికడుపులో పొడిచాడు. దాడి అనంతరం తన గాళ్ ఫ్రెండ్ ను తీసుకొని కార్తీక్ బైక్ మీద పారిపోయాడు. ఈ విచిత్రమైన క్రైం ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.