Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం!

దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు హుటా హుటున వరుణ్‌ ను ఫోర్ట్ వెయిన్ ఆసుపత్రికి తరలించారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 5:38 AM GMT
అమెరికాలో తెలుగు విద్యార్థిపై  కత్తితో దాడి.. పరిస్థితి విషమం!
X

ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారతీయులపై దుండగుల తుపాకీ దాడులు, కత్తి పోట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్నత భవిష్యత్తుకోసమని వెళ్లిన పిల్లలకు ఇలా జరుగుతుండటంతో స్వదేశంలోని తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక తెలుగు విద్యార్థిపై అమెరికాలో కత్తితో దాడి జరిగింది.

అవును... అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికుల చొరవతో హుటా హుటిని ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని అంటున్నారు. ఈ విషయాలను ఆ విద్యార్థి తండ్రి వెల్లడించారు.

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌ రాజ్‌(29) ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతున్నాడు. ఇలా ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్‌ టైం జాబ్‌ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఇండియానాలోని వ‌ల్పరైసో సిటీలో ఉన్న ఓ జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా జోర్డాన్ ఆండ్రాడ్ అనే దుండగుడు కత్తితో అటాక్ చేశాడు.

దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు హుటా హుటున వరుణ్‌ ను ఫోర్ట్ వెయిన్ ఆసుపత్రికి తరలించారు. దీంతో... వైద్యులు వరుణ్‌ కు శస్త్ర చికిత్స చేశారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని.. యువకుడి తండ్రి రామ్మూర్తి తెలిపారు!

ఈ క్రమంలో వరుణ్‌ రాజ్‌ పై దాడి చేసిన వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకుని, హ‌త్యాయ‌త్నం కింద కేసు బుక్ చేశారు. మరోవైపు మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్‌ రాజ్‌ తండ్రి రామ్మూర్తి.. మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ ను కలిశారు! తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని ఆయన మంత్రిని కోరారు. దీనిపై మంత్రి భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది!