కన్ను పడితే బుట్టలో పడాల్సిందే.. ఇప్పటివరకు ఎంతమందిని ట్రాప్ చేశాడంటే..!
వివిధ సామాజిక మాధ్యమాలను వినియోగించి అనేక ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను తన వలలో పడేట్టు చేసుకున్నాడు.
By: Tupaki Desk | 4 Jan 2025 9:30 PM GMTఅమ్మాయిపై కన్ను పడితే చాలు ఎలా అయినా ట్రాప్‌లో పడేయడం ఆ వ్యక్తికి అలవాటు. మాటలు చెప్పి, మాయలు చేసి వారిని బుట్టలో వేసుకోవడం ఆ వ్యక్తికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటి వరకు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 700 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. వివిధ సామాజిక మాధ్యమాలను వినియోగించి అనేక ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను తన వలలో పడేట్టు చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన తుషార్ సింగ్ బిష్ట్. గడిచిన కొన్నాళ్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేస్తూ అనేక మంది అమ్మాయిలను వలలో వేసుకున్నాడు. తనను తాను అమెరికాకు చెందిన మోడల్‌గా వారికి పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి.. వారితో సన్నిహిత సంబంధాలను నెరిపాడు. ఒకరి తెలియకుండా ఒకరితో సంబంధాలను నేర్పుతూ ఆర్థికంగానూ భారీగానే లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. అమ్మాయిలను డ్రాప్ చేసేందుకు ఎక్కువగా బంబల్, స్నాప్ చాట్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగించాడు. సాగర్ అమ్మాయిలతో చాటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించేవాడు. అమ్మాయిలతో సన్నిహితంగా మెలుగుతూ వారిని తన ఆధీనంలోకి తెచ్చుకునే వాడు. తాను చెప్పినట్లు చేస్తున్నారు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలను జరిపేవాడు. అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ సదరు యువతుల నుంచి భారీగానే డబ్బులు లాగేసినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల కిందట తుషార్ సింగ్‌తో సన్నిహితంగా మెలిగిన ఒక యువత నుంచి భారీగా డబ్బులను డిమాండ్ చేశాడు. గతంలో ఇద్దరు సన్నిహితంగా మెలిగిన ఫోటోలను సదరు యువతకు పెట్టి బ్లాక్ మెయిల్ చేయడంతో ఒక్కసారిగా ఆ యువతి ఖంగు తినాల్సి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సదరు యువతి తనకు ఎదురైన ఇబ్బందుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిష్ట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే అతని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు.
విచారంలో భాగంగా వాట్సాప్‌తోపాటు సోషల్ మీడియాలో అకౌంట్లను పోలీసులు వెరిఫై చేశారు. ఈ సందర్భంగా పోలీసులను షాక్‌కు గురిచేసేలా అనేక విషయాలు వెల్లడయ్యాయి. తుఫాన్ సింగ్ వినియోగిస్తున్న ఫోన్లలో సుమారు 700 మంది అమ్మాయిలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో వందలాది మంది అమ్మాయిలతో చేసిన చాటింగ్ వివరాలతో పాటు సన్నిహితంగా మెలిగిన ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 700 మంది అమ్మాయిలను ఈ విధంగా వలలో వేసుకున్న తుషార్ సింగ్.. ఇందులో వందలాది మంది నుంచి ఈ విధంగానే బ్లాక్ మెయిల్ చేసి భారీగానే డబ్బులు రాబట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు యువతులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరెవరికి ఇచ్చారన్న విషయాలను పోలీసులు రాబడుతున్నారు. తుషార్ సింగ్ ఒక్కడే ఈ వ్యవహారాలకి పాల్పడ్డాడా.? ఇంకెవరైనా వెనుక ఉన్నారా అన్నదానిపైన పోలీసులు దృష్టి సారిస్తున్నారు.