విశాఖ కానిస్టేబుల్ హత్యలో గగుర్పొడిచే విషయాలు!
By: Tupaki Desk | 4 Aug 2023 3:35 PM GMTశారీరక వాంఛ కోసం కట్టుకున్న భర్తను చంపించేసిన ఘటన విశాఖతోపాటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. నేరాలను కట్టడిచేసే పోలీసు కుటుంబంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఇలా జరిగిన విశాఖలో వన్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు.
అవును... విశాఖలో సంచలనం సృష్టించిన వన్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్ ను తన భార్య హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సీపీ మీడియాకు వెల్లడించారు.
వివరాళ్లోకి వెళ్తే... విశాఖపట్నం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు! తొలుత దీనిని సాధారణ మరణమే అనుకున్నా.. తర్వాత ఎందుకో అనుమానం వచ్చి.. విచారణ చేపట్టగా గగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం, శారీరక వాంఛ కోసమే.. కానిస్టేబుల్ ని కట్టుకున్న భార్యే చంపేసిందని తెలిసింది.
ఈ విషయాలపై స్పందించిన సీపీ... "కానిస్టేబుల్ ను అతని భార్య హత్య చేయించింది. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ మృతిపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో పోస్టుమార్టంకు పంపించాం. అయితే పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడక రమేష్ చనిపోయినట్లు తేలింది" అని ఈ కేసుకు సంబంధించి మొదలైన అనుమానాన్ని వెల్లడించారు.
ఈ క్రమంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన సమయంలో... ప్రియుడి కోసం భర్తను భార్యే హత్య చేయించినట్లు తేలిందని సీపీ వెల్లడించారు. వీరిద్దరి మధ్య ఏడాదిన్నరగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. కానిస్టేబుల్ ఎదురింట్లోనే ఆమె ప్రియుడు ఉంటున్నాడని సీపీ తెలిపారు.
ఈ సమయంలో మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ కు అతని భార్య మద్యం తాగించింది. ఆ సమయంలో ప్రియుడు, అతని స్నేహితుడిని ఇంటి బయటే ఉంచింది. అనంతరం కానిస్టేబుల్ పడుకున్న తర్వాత ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడు ఇంట్లోకి ప్రవేశించి దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపారు. ఆ సమయంలో తన భర్త కానిస్టేబుల్ కాళ్లను కదలకుండా ఆమె పట్టుకుందని సీపీ వెల్లడించారు.
తన భార్యకు ఉన్న ప్రేమ వ్యవహారం గురించి గతంలో కానిస్టేబుల్ ఇంట్లో చాలా గొడవలు జరిగాయని తెలిపిన సీపీ... ఈ సమయంలో పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోమని కూడా కానిస్టేబుల్ తన భార్యతో చెప్పాడని తెలిపారు. అయితే పిల్లలూ, ప్రియూ కూడా కావాలని నిర్ణయించుకున్న ఆమె... ఈ దారుణానికి వడిగట్టిందని వెల్లడించారు.
ఈ సమయంలో బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర రూపాయాలు ప్రియుడికి ఇచ్చిందట కానిస్టేబుల్ భార్య. ఇలా ఒక కన్ క్లూజన్ కి వచ్చిన ఈ కేసులో ఏ1 కానిస్టేబుల్ భార్య, ఏ2 ఆమె ప్రియుడు, ఏ3 ఆ ప్రియుడికి సహకరించిన అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.