Begin typing your search above and press return to search.

మణిపూర్‌ వదిలేసి వెళ్తున్న మెయితీ తెగ.. పరిస్థితి ఇది!

వారికి భద్రత కల్పించేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది

By:  Tupaki Desk   |   24 July 2023 5:31 AM GMT
మణిపూర్‌ వదిలేసి వెళ్తున్న మెయితీ తెగ.. పరిస్థితి ఇది!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మణిపూర్ ఘోరాలు, జరుగుతున్న సంఘటలు, వాటికి దారితీస్తున్న పరిస్థితులు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇప్పుడు వలసలు సైతం మొదలయ్యాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడినవారు రివేంజ్ తీర్చుకునే ప్రమాధానికి మరోవర్గంలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అవును... మణిపూర్‌ లో ఇటీవల ఇద్దరు కుకీ తెగకు చెందిన మహిళలను హింసించి, నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచీ మణిపూర్ లో జరుగుతున్న ఘోరాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో మెయితీ తెగకు చెందిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.

కుకీ తెగకు చెందిన మహిళలను తీవ్రంగా హింసించడంతో.. ఆ వర్గం ప్రజలు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మెయితీ తెగకు చెందిన వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మెయితీ తెగ కు చెందిన కొందరు మణిపూర్ వదిలి అసోం వెళ్తున్నారు. అలా వెళ్లిన వారికి అక్కడ మరో సమస్య ఎదురయ్యింది.

మెయితీ తెగకు చెందిన కొందరు మే 4న కుకీ తెగవారి కోసం వెతుకుతూ ఓ గ్రామంపై దాడికి వెళ్లి, ఆ సమయంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంతో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఇదేసమయంలో మెయితీ తెగకు చెందిన వారు మణిపూర్ వదిలి అసోం వెళ్లిపోయారు.

ఈ సమయంలో మిజోరంలోని ఓ మాజీ మిలిటెంట్ల సంస్థ తాజాగా మెయితీలకు ఓ సూచన చేసింది. మెయితీలు అందరూ మణిపూర్ వదిలి వెళ్లాలని చెప్పింది. మిజో యూత్‌ ఆగ్రహావేశాలతో ఉందని తెలిపింది. దీంతో ప్రతీకార చర్యలకు భయపడి మిజోరంలో తలదాచుకుంటున్న మెయితీలకు కొత్త సమస్య వచ్చిపడింది.

అయితే... వారికి భద్రత కల్పించేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అసోం పోలీసులు వీరికి భద్రత కల్పిస్తున్నారని చెబుతోంది. మరోపక్క ఎవరూ రాష్ట్రం విడిచి వెళ్లనవసరం లేదని.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలు బయటకు వచ్చాక మెయితీ వర్గంలో భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో వారికి భద్రత కల్పిస్తామని మణిపూర్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.