Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలు ఎక్కిన సెన్సేషనల్ మూవీ హీరోయిన్‌

క్యూట్‌ అందాలతో ఒరు అదార్ లవ్‌ లో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నూర్‌ షరీఫ్‌

By:  Tupaki Desk   |   26 July 2023 10:47 AM GMT
పెళ్లి పీటలు ఎక్కిన సెన్సేషనల్ మూవీ హీరోయిన్‌
X

మలయాళ సూపర్‌ హిట్ మూవీ ఒరు అదార్ లవ్‌ తో హీరోయిన్‌ గా అందరికి పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌. ఆ సినిమాలో ప్రియా వారియర్ తో పాటు మరో హీరోయిన్‌ కూడా ఉంది. ఆమె మరెవ్వరో కాదు నూరీన్‌ షరీఫ్‌. మొదట ఈమెనే మెయిన్‌ హీరోయిన్‌ గా చూపించారట. కానీ వింక్ బ్యూటీ అనూహ్యంగా తెరపైకి రావడంతో ఆమె పాత్ర నిడివి పెంచారని అప్పుడు ప్రచారం జరిగింది.

ఒరు అదార్ లవ్‌ సినిమాను తెలుగు లో లవర్స్ డే అనే టైటిల్‌ తో రిలీజ్ చేయడం జరిగింది. ఒరిజినల్ భాషలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో హీరోయిన్ నూరీన్‌ షరీఫ్ గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. అయినా కూడా కొన్ని సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది.

క్యూట్‌ అందాలతో ఒరు అదార్ లవ్‌ లో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నూర్‌ షరీఫ్‌ ను చాలా మంది అభిమానించారు. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయి లో ఆఫర్లు రాలేదు. దాంతో ఈమె మెల్లగా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈమె తిరువనంతపురంలో పెళ్లి పీటలు ఎక్కింది. నూర్‌ షరీఫ్ పెళ్లి చేసుకున్న ఫహీమ్‌ జాఫర్‌ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. నటుడు మరియు స్క్రీన్‌ ప్లే రైటర్ అయిన ఫహీమ్‌ తో నూర్‌ షరీఫ్ చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం తో పెళ్లి చేసుకున్న ఈ జంట ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.

ఈ పెళ్లికి ఒరు ఆదార్‌ లవ్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు నటీ నటులు పలువురు హాజరు అయ్యారు. అంతే కాకుండా తెలుగు తో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ శరణ్య మోహన్ కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. నూర్‌ షరీఫ్‌ పెళ్లికి హాజరైన సెలబ్రెటీలు ఆ ఫోటోలు వీడియోలను షేర్ చేశారు.