అదే నిజమైతే తప్పక ఖండిస్తాను!
ఫెప్సీ పరిశ్రమకి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్లు వినిపిస్తోంది
By: Tupaki Desk | 25 July 2023 10:54 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సాయితేజ్ నటించిన 'బ్రో' రిలీజ్ నేపథ్యంలో టీమ్ ప్రచారం పనుల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉంటే మిగతా టీమ్ అంతా ప్రచార భారం మోస్తున్నారు. దీనిలో భాగంగా సాయితేజ్ యువతని టార్గెట్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు సముద్రఖని కూడా ఇంటర్వ్యూలు షురూ చేసారు.
ఇప్పటివరకూ నటుడిగానే ఇంటర్వూలు ఇచ్చిన ఆయన తొలిసారి టాలీవుడ్ మీడియాతో దర్శకుడి హోదాలో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 'బ్రో' విశేషాలు పంచుకుంటున్నారు. ఆన్ సెట్స్ అనుభవాలు ఒక్కోక్కటిగా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ పరిశ్రమలో దక్షిణాది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెండరేషన్ ఓ విదాస్పదన నిర్ణయాన్ని తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది.
తమిళ సినిమాల్లో తమ వారు తప్ప ఇతర భాషలకు చెందిన నటీనటులుగానీ..సాంకేతిక నిపుణులు గానీ తీసుకోకూ డదని ఆంక్షలు విధించినట్లు ప్రచారం తెరపైకి వస్తోంది. దీనికి సంబంధించి ఫెప్సీ పరిశ్రమకి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్లు వినిపిస్తోంది. ఈ అంశంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు సముద్రఖని స్పందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
'ఫెప్సీ విడుదల చేసిన మార్గదర్శకాలు ఏంటి? అన్నది స్పష్టంగా తెలియదు. 'బ్రో 'సినిమాలో బిజీగా ఉన్నాను. ఈ విషయం కూడా నా వద్దకు ఇంకా చేరలేదు. దీనిపై సరైన స్పష్టత కూడా లేదు. భాషకు..కళాకారులకు హద్దులంటూ ఏమీ ఉండవు. ఒక భాషలో నటులు మరో భాషకి వెళ్తారు. అలాంటప్పుడే పాన్ ఇండియా సినిమాలు వస్తాయి. సౌత్ లో రకరకరాల దర్శకులు అన్ని రకాల పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నారు. ఒకవేళ ఫెప్సీ నిలువరించే నిర్ణయమే తీసుకుంటే అది తప్పు అనే అంటాను' అని అన్నారు.