Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో బీటెక్.. గుండె గట్టిగా పట్టుకోండి బాస్

మీ పిల్లల్ని బీటెక్ చదివించాలనుకుంటున్నారా? హైదరాబాద్ మహానగరంలో అయితే మరింత బాగా ఉంటుందని భావిస్తున్నారా?

By:  Tupaki Desk   |   9 Feb 2025 5:14 AM GMT
హైదరాబాద్ లో బీటెక్.. గుండె గట్టిగా పట్టుకోండి బాస్
X

మీ పిల్లల్ని బీటెక్ చదివించాలనుకుంటున్నారా? హైదరాబాద్ మహానగరంలో అయితే మరింత బాగా ఉంటుందని భావిస్తున్నారా? అయితే.. త్వరలో తగిలే షాక్ కు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకుంటే.. ఇప్పటికే తాము వసూలు చేస్తున్న ఫీజులకు అదనంగా భారీగా ఫీజులు వసూలు చేసేందుకు వీలుగా అనుమతుల కోసం ఆయా కాలేజీల యాజమాన్యాలు సరికొత్త ప్రతిపాదనలు సమర్పించిన కొత్త విషయం తాజాగా వెలుగు చూసింది.

తెలంగాణ ప్రవేశాలు.. రుసుముల నియంత్రణ మండలికి సమర్పించిన ప్రతిపాదనలు చూస్తే.. ఒక ఏడాది బీటెక్ చదువు కోసం ఏకంగా రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. హాస్టల్ లో ఉండాలంటే ఆ ఖర్చు అదనం. ఇంత భారీగా పెంచేందుకు అనుమతులు కోరుతూ చేపట్టిన ప్రతిపాదనలు చూసినప్పుడు.. చదువు మరింత ఖరీదెక్కిన వైనం అర్థమవుతుంది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 33 కళాశాలల్లో రూ.లక్ష.. దాని కంటే ఎక్కువగా ఉండగా.. ఈసారి ఆ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కాకుంటే.. ఫీజుల పెంపునకు ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది. అంతేకాదు.. తొలిసారి పలు కాలేజీల్లో ఫీజు రూ.2 లక్షల మార్కును చేరుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణప్ర రాష్ట్రంలో ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను సవరిస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఫీజుల్ని 2022లో నిర్ణయించారు.

పెంచిన ఫీజులు ఎవరికి వర్తిస్తాయంటే.. మొదటి సంవత్సరంలో విద్యార్థి నుంచి ఏ ఫీజు అయితే వసూలు చేస్తారో.. నాలుగేళ్లు అదే ఫీజును వసూలు చేస్తారు. అంటే.. కొత్తగా పెంచే ఫీజులు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో చేరే వారికి మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత ఫీజుల గడువు ముగుస్తుంది. కొత్త ఫీజుల లెక్క ప్రభుత్వ అనుమతితో ఓకే కానుంది.

కొత్త ఫీజుల కోసం 157 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు అప్లై చేశాయి. కాలేజీల్లో సిబ్బంది వేతనాలు.. నిర్వహణ వ్యయం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకొని కొత్త ఫీజులను కమిటీ డిసైడ్ చేయనుంది. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. కొన్ని కాలేజీలకు ఫీజులను పెంచగా.. కొన్నింటికి తగ్గింపులు చేస్తారు. అయితే.. అలాంటి సందర్భాలు తక్కువగా ఉంటాయని చెప్పాలి. తాజాగా ప్రతిపాదించిన కొత్త ఫీజుల వివరాల్ని చూస్తే.. హైదరాబాద్ లో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలుగా పేరున్న వారు ఇప్పుడు వసూలు చేస్తున్నదెంత? వారి కొత్త ఫీజు ప్రతిపాదన ఎంత? అన్నది చూస్తే..

కాలేజీ ప్రస్తుత ఫీజు(లక్షల్లో) కొత్త ఫీజు (?) (లక్షల్లో)

సీబీఐటీ 1.65 2.94

వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి 1.35 2.84

ఎంజీఐటీ 1.60 2.45

వాసవి 1.40 2.16

ఎస్ఆర్ 1.30 2.00

సీవీఆర్ 1.50 1.98

వర్దమాన్ 1.40.. 1.90

గోకరాజు రంగరాజు 1.30 1.90

శ్రీనిధి 1.30 1.80

సెయింట్ మార్టిన్స్ 1.00 1.75

నారాయణమ్మ 1.00 1.70

బీవీఆర్ఐటీ 1.20 1.66