సికిందర్ వర్సెస్ మ్యాడ్ స్క్వేర్.. ఇది బాలీవుడ్ పరిస్థితి
బాలీవుడ్ సినిమాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా తర్వాత హిందీ సినిమా పరిశ్రమ సాధించిన సక్సెస్‌లు చాలా చాలా తక్కువ అనే విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 27 March 2025 6:39 AMబాలీవుడ్ సినిమాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా తర్వాత హిందీ సినిమా పరిశ్రమ సాధించిన సక్సెస్‌లు చాలా చాలా తక్కువ అనే విషయం తెల్సిందే. వందల కోట్ల బడ్జెట్ సినిమాల ఓపెనింగ్స్ చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. ఒకప్పుడు మినిమం వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోలు సైతం ఇప్పుడు పాతిక కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌ను రాబట్టడానికి కిందా మీదా పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఈయన హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికిందర్ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మినిమం అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాలేదని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన ఈ సినిమా ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీక్ మిడిల్‌లో రావడంను కొందరు తప్పుబడుతున్నారు. ఈ శుక్రవారం సినిమా వచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్‌లో అసలే పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి సమయంలో సల్లూ భాయ్ తన సికిందర్ విడుదల తేదీ విషయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఏంటి అంటూ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం విడుదల అనేది సల్మాన్ సినిమాకు ఎంత వరకు కలిసి వస్తుంది అనేది చూడాలి.
ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.10 కోట్ల నమోదు అయినట్లు తెలుస్తోంది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్ చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బుక్ మై షో డేటాను చూస్తే గంటకు వెయ్యి టికెట్ల చొప్పున అమ్ముడు పోతున్నాయి. వీకెండ్ లేకున్నా రంజాన్ సెలవు కలిసి వస్తుందనే ఉద్దేశంతో సల్మాన్ రిలీజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ బుకింగ్ ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. ఇదే సమయంలో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తే మతి పోతుంది. గంటలకు దాదాపు 2 వేల నుంచి 3 వేల టికెట్లు బుక్ మై షో లో బుక్ అవుతున్నాయి.
సికిందర్‌కి మోహన్ లాల్ సినిమా ఎల్ 2 నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. హిందీలోనూ ఎల్ 2 సినిమాను విడుదల చేస్తున్నారు. హిందీ వర్షన్‌కి మాత్రమే కాకుండా మలయాళ వర్షన్‌ని నార్త్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అత్యధిక టికెట్లు అమ్ముడు పోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు. కానీ టాలీవుడ్‌లో చిన్న హీరోల సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు వస్తున్నా కూడా జనాల నుంచి ఆధరణ ఎక్కువగా ఉంటుంది. సినిమాకు సాలిడ్ ప్రమోషన్స్ చేసి, జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తే కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఫలితం బాగుంటే భారీ వసూళ్లు నమోదు అవుతాయి. కానీ బాలీవుడ్‌లో ఎంతటి ప్రమోషన్ చేసినా స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్ అంతంత మాత్రమే నమోదు అవుతున్నాయి. బాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితికి ఇది అద్దం పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.