Begin typing your search above and press return to search.

"ది ప్యారడైజ్" - మదర్ రోల్ మరో లెవెల్

తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్, మరాఠీ నటీమణి సోనాలి కులకర్ణి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   3 March 2025 5:43 PM IST
ది ప్యారడైజ్ - మదర్ రోల్ మరో లెవెల్
X

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ది ప్యారడైజ్ గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నాని లుక్, కథనంతో పాటు ఇతర కీలక పాత్రలు కూడా ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్, మరాఠీ నటీమణి సోనాలి కులకర్ణి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

గతంలో హిందీలో దిల్ ఛాహతా హై, సల్మాన్ భరత్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన సోనాలి, తొలిసారి తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నారు. గతంలో బాహుబలి, సలార్ లాంటి సినిమాల్లో తల్లి పాత్ర ఎంత బలంగా ఉంటే ఆ సినిమాలకు అంత పెద్ద స్థాయిలో రిస్పాన్స్ వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో తల్లి పాత్రను మలిచే విధానం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే రూట్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. సోనాలి కులకర్ణి పాత్ర కూడా ఇందులో అంతే ప్రాధాన్యతతో ఉండబోతోందని తెలుస్తోంది. టీజర్ చూస్తేనే ది ప్యారడైజ్ చిత్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఒక విలక్షణమైన కథను చెప్పబోతోందని అర్థమవుతోంది. నాని పాత్రలో రా ఇంటెన్సిటీ, మాస్ మేనరిజం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రక్తం పోసి పెంచిన కొడుకు అనే డైలాగ్ కూడా టీజర్ లో బాగా హైలెట్ అయ్యింది. కాబట్టి తల్లి పాత్ర ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. నానికి తల్లిగా సోనాలి కీలకంగా ఉండబోతోందని సమాచారం. కేజీఎఫ్, పుష్ప, సలార్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో మదర్ సెంటిమెంట్ పెద్దపాత్ర పోషించినట్లు ఈ సినిమాలోనూ అలాంటి ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుందనేది ట్రేడ్ టాక్.

ఇప్పటి వరకు తెలుగులో నటించని సోనాలి కులకర్ణి, తొలిసారి నానితో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఆమె నటనకు బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ పాత్రలను చక్కగా ప్రెజెంట్ చేయడంలో ఆమెకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ సినిమా కోసం ఆమె స్పెషల్ లుక్‌లో కనిపించనుందట. గతంలో రమ్య కృష్ణ, నదియా, తరుణ్ అరోరా వంటి సీనియర్ యాక్టర్స్ మదర్ రోల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో తన మార్క్ చూపించాడు. రా మాస్ కథలను చాలా స్టైల్‌గా ప్రెజెంట్ చేయడంలో ఆయన టాలెంట్ ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇప్పుడు ది ప్యారడైజ్ లో కూడా మాఫియా నేపథ్యంలో కుటుంబ ఎమోషన్స్‌ను మిక్స్ చేస్తూ స్టోరీని చెప్పబోతున్నట్లు సమాచారం. మదర్ సన్ బాండ్‌ను పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడం కోసం ప్రత్యేకమైన సీన్లు డిజైన్ చేసినట్లు టాక్. నాని కెరీర్‌లో మరో విభిన్నమైన సినిమాగా నిలవబోతున్న ది ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.