1000 మంది డాన్సర్ల మధ్యలో సంబరాల బాబు!
మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్. కె.పి దర్శకత్వంలో 'సంబరాల ఏటిగట్టు' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 March 2025 5:00 PM ISTమెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్. కె.పి దర్శకత్వంలో 'సంబరాల ఏటిగట్టు' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ సాయితేజ్ కెరీర్ లో ఇంత బడ్జెట్ తో ఏ సినిమా తెరకెక్కలేదు. తొలిసారి సాయితేజ్ మార్కెట్ నిమించి ఖర్చు చేస్తున్నారు.
'విరూపాక్ష' 100 కోట్లు రాబట్టిన నమ్మకంతోనే తేజ్ పై ఇన్ని కోట్లు పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ 65 శాతం పూర్తయింది. అంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇది భారీ హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ అని సమాచారం. ఈ సన్నివేశాల కోసం సాయితేజ్ సాహసం సైతం చేసాడట.
రిస్క్ సన్నివేశాలైనా ఏమాత్రం అధైర్య పడకుండా నటించాడట. మరోవైపు దినేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాట చిత్రీకరణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఏకంగా 1000 మంది డాన్సర్లు పని చేస్తున్నారట. ఇంత మంది డాన్సర్లతో ఇప్పటి వరకూ పాట చిత్రీకరణ ఏ సినిమాకు జరగలేదు. తొలిసారి 'సంబరాల ఏటిగట్టు' కోసం టీమ్ ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి సినిమాలో చాలా విశేషాలు కనిపిస్తున్నాయి. ఇంకా షూటింగ్ 35 శాతం పెండింగ్ ఉంది. ఆ సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో షూట్ పూర్తయిన నేపథ్యంలో గ్యాప్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.