Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అగ్ర హీరోకి 100 కోట్ల ఆఫ‌ర్

ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన సీనియ‌ర్ హీరో, ప‌రిశ్ర‌మ మూల‌స్థంభం అయిన అగ్ర హీరోకి ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ చిత్రానికి ఒప్పించేందుకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   18 Feb 2024 4:30 PM GMT
టాలీవుడ్ అగ్ర హీరోకి 100 కోట్ల ఆఫ‌ర్
X

ఇటీవ‌ల పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ల పారితోషికాలు అమాంతం పెరుగుతున్నాయి. ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరో 100 కోట్లు అందుకుంటున్నాడ‌న్న స‌మాచారం ఉంది. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ పేర్లు వంద కోట్ల క్ల‌బ్ రేసులో చేరుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన సీనియ‌ర్ హీరో, ప‌రిశ్ర‌మ మూల‌స్థంభం అయిన అగ్ర హీరోకి ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ చిత్రానికి ఒప్పించేందుకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

తన స్థాయికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగినట్లుగా ఇంత పెద్ద‌ పారితోషికం ఆఫర్ చేసార‌ని తెలుస్తోంది. అయితే స‌ద‌రు అగ్ర హీరో సరైన స్క్రిప్ట్, దర్శకుడి కోసం వెతుకుతున్నందున దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవ‌ల వ‌రుస చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్న పాపుల‌ర్ బ్యాన‌ర్ అగ్ర‌హీరోతో చేతులు కలపడానికి సంసిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇటీవ‌ల తెలుగులో పెద్ద హీరోతో ప‌ని చేసిన స‌ద‌రు నిర్మాణ సంస్థ త‌దుప‌రి మ‌రో అగ్ర హీరోతో భారీ థ్రిల్ల‌ర్ సినిమాని తెర‌కెక్కిస్తోంది. ఇంత‌లోనే ఇప్పుడు ఇండ‌స్ట్రీ కీల‌క మూల స్థంభం అయిన పెద్ద హీరోతో సినిమా తీసేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డ‌మే గాక‌, క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో భారీ పాన్ ఇండియా సినిమాని నిర్మించాల‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ క‌ల‌లుగంటోంది. ఇంకా అగ్ర హీరో అంగీక‌రించ‌లేదు. సినిమాకి సంత‌కం చేయ‌లేదు. ఒక‌వేళ ఆ రెండూ జ‌రిగితే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.